సంక‌ట స్థితిలో రామోజీ.. అస‌లేం జ‌రిగింది?

July 13, 2018 at 6:23 pm
Ramoji rao, Eenadu, Modi, BJP, TDP, Chandra babu, Promotion

రాజ‌కీయాలంటే.. రోడ్ల‌మీద‌కే రాన‌వ‌స‌రం లేదు. నాలుగు గోడ‌ల మ‌ద్య ఉండి కూడా నాయ‌కుల‌ను నిర్ణ‌యించ‌వ‌చ్చు.. వారిని నిర్దేశించ‌వ‌చ్చు. రాజ‌కీయంగా చక్రం కూడా తిప్ప‌వ‌చ్చు! ఇలాంటి వారు చాలా చాలా త‌క్కువ మందే ఉన్నారు. వారిలో ప్ర‌ముఖంగా తెర‌మీదికి వ‌స్తున్నారు.. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు. తెలుగునాట రాజ‌కీయాల్లో 1980ల నుంచి కూడా రామోజీ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. అప్ప‌ట్లో ఎన్టీఆర్ ను రాజ‌కీయాల్లోకి తీసుకు వ‌చ్చిన వారిలో రామోజీరావు అగ్ర‌స్థానంలో ఉన్నార‌ని అంటారు. అదేస‌మ‌యంలో టీడీపీకి అండ‌గా ఉంటూ వ‌చ్చారు. కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ క‌త్తి క‌ట్ట‌గా.. తెర‌వెనుక ఆయ‌న‌కు అన్ని విధాలా సాయం చేసిన అధినేత రామోజీరావేన‌నేది నిజ‌మ‌ని అంటారు సీనియ‌ర్లు.

ఇక‌, ఆ త‌ర్వాత రామారావును గ‌ద్దె దింపిన చంద్ర‌బాబు ప‌క్షంలో చేరిపోయారు రామోజీ.అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చంద్ర‌బాబుకు ప‌రోక్షంగా రామోజీ సాయం అన్ని విధాలా అందుతూనే ఉంది. ఇలా రాజ‌కీయాల‌తో నేరుగా సంబంధం లేక‌పోయినా.. రామోజీరావు మాత్రం తెర‌వెనుక నాయ‌కుల‌ను, నేత‌ల‌ను నిర్దేశిస్తూనే ఉన్నారు.క‌ట్ చేస్తే.. కేంద్రంలో మాత్రం బీజేపీ అంటే రామోజీరావు ప్రాణం పెడ‌తార‌ని అంటారు. గ‌తంలో వాజ‌పేయి ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వెనుక ఈయ‌న చ‌క్రం తిప్పార‌ని సీనియ‌ర్లు చెప్పే మాట‌. అంతేకాదు, వాజ‌పేయికి తెలుగు నాట పెద్ద ఎత్తున ప్ర‌చారం క‌ల్పించింది కూడా రామోజీరావే. కేంద్రం ఏదైనా ప‌థ‌కం ప్ర‌క‌టిస్తే.. దానికి మ‌ద్ద‌తుగా ఇక్క‌డ ఆయ‌న అనేక విధాలు ప్ర‌చారం చేస్తున్నారు.

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి అన్ని విధాలా ఇక్క‌డ అండ‌గా నిల‌బ‌డ్డారు రామోజీ. కేంద్రం ఏదైనా ప‌థ‌కం ప్ర‌వేశ పెడితే.. వెంట‌నే ఆయ‌న దాదాని త‌న మీడియా ద్వారా విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సుజ‌లాం సుఫ‌లాం వంటి కార్య‌క్ర‌మం రెండేళ్లుగా ఈనాడు ఆధ్వ‌ర్యంలో జిల్లాల్లో జ‌రుగుతూనే ఉంది. అదేవిధంగా కార్పొరేట్ సంస్థ‌లు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌న్న మోడీ పిలుపుతో రామోజీ క‌ద‌లి వ‌చ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ‌లో తాను పుట్టిన ఊరును రామోజీ ద‌త్త‌త తీసుకు డెవ‌ల‌ప్ చేశారు. ఓడీఎఫ్ విష‌యంలోనూ రామోజీ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు ల‌క్ష‌కు పైగా మ‌రుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు. ఇలా కేంద్రంతో(మోడీ ప్ర‌భుత్వం) రామోజీ స‌త్సంబంధాలు నెరుపుతున్నారు.

అయితే, ఇప్పుడు బీజేపీ నేరుగా రామోజీ సాయం కోరేందుకు రెడీ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న మీడియా ద్వారా బీజేపీకి ప్ర‌చారం క‌ల్పించాల‌నేది వీరి అభ్య‌ర్థ‌న‌. అయితే, చంద్ర‌బాబుకు ఇప్ప‌టి వ‌ర‌కు అండ‌గా ఉంటూ వ‌చ్చిన రామోజీకి.. బీజేపీ అభ్య‌ర్థ‌న‌తో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఒక‌ప‌క్క‌, బీజేపీని తిట్టిపోస్తున్న చంద్ర‌బాబు, మ‌రోప‌క్క రాష్ట్రంలో ఎద‌గాల‌నుకుంటున్న బీజేపీ.. ఈ రెండు విష‌యాల్లోనూ రామోజీ పాత్ర ఏం చేయ‌నుంద‌నేది ఇప్పుడు సంక‌టంగా మారింది. మ‌రి రాజ‌కీయాల్లో లేకుండా.. రాజ‌కీయాల‌ను శాసించే రామోజీ ఇప్పుడు ఎదురైన సంఘ‌ట‌న‌కు ఆయ‌న ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

సంక‌ట స్థితిలో రామోజీ.. అస‌లేం జ‌రిగింది?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share