మాజీ మంత్రి రావెల‌.. టీడీపీకి గుడ్‌బై!

July 13, 2018 at 12:08 pm
Ravela kishore, Ex minister, TDP, Guntur, pathipadu, wants to exit from TDP

మాజీ మంత్రి, ఎస్సీ నేత‌, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు.. టీడీపీకి గుడ్ బై చెప్ప‌నున్నారు. అనూహ్యంగా రాజ‌కీ యాల్లోకి వ‌చ్చిన ఆయ‌న అంతే అనూహ్యంగా టీడీపీ త‌ర‌ఫున టికెట్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే అనూహ్యంగా టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నారు. 2014లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి అనూహ్య రీతిలో పార్టీలోకి వ‌చ్చిన ఆయ‌న చివ‌రి నిముషంలో టీడీపీ టికెట్ సాధించుకున్నారు. ఆయ‌న అప్ప‌టి ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డంతోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌విని కూడా ఆఫ‌ర్ చేశారు. అయితే, మంత్రిగా ఆయ‌న తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యారు. ఫ్యామిలీ రాజ‌కీయాల‌ను అరిక‌ట్ట‌లేక పోయారు. త‌న‌కు సంబందం లేద‌ని గుంటూరు జెడ్పీ రాజ‌కీయాల్లోనూ వేలు పెట్టారు.

జెడ్పీ చైర్మ‌న్‌ను ఏక‌ప‌క్షంగా ఆయ‌న మ‌ద్ద‌తిచ్చారు. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ కిశోర్ బాబు వివాదాస్ప‌ద మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఆయ‌న‌ను ప‌క్క‌కు పెట్టారు. అంతేకాదు, మంత్రి ప‌ద‌వి నుంచి కూడా ఆయ‌న‌ను ప‌క్క‌కు త‌ప్పించారు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురవుతున్న కిశోర్‌బాబు.. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తన దోవ తాను చూసుకోవడానికి సిదద్ద‌మ‌య్యారు. ప్రస్తుతం గుంటూరు పట్టణంలో వెలసిన పోస్టర్లు చూస్తే..ఆయన ఇక..టీడీపీలో ఉండరని తేలిపోతోంది. ఈ నెల13న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఎస్సీ చట్టసవరణపై సుప్రీం కోర్టు చేసిన సిఫార్సులను ఉపసంహరించుకోవాలని ఆయన దీక్ష చేయబోతున్నారు. పట్టణంలో ఈ మేరకు…దాని గురించి పోస్టర్లు వెలిశాయి.

ఈ పోస్టర్లలో..కేవలం రావెల ఫోటో మాత్రమే ముద్రించింది. అదీ…బీఎస్పీ కలర్‌తో ముద్రించిన పోస్టర్లు..నగరంలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయి ఉండి..ఆ పార్టీ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా … ఒక్కడే.. ఎస్సీ చట్టసవరణపై దీక్ష చేపడుతున్నానని ప్రకటించడం పలువురు టీడీపీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన త్వ‌ర‌లోనే వైసీపీలోకి జంప్ చేస్తార‌ని అంటున్నారు. అయితే..ఇటీవల కాలంలో.. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గర అవ్వాలని భావించినా..అది సక్సెస్ కాలేదు. వచ్చే ఎన్నికల్లో..పత్తిపాడు నుంచి ఆయనకు టీడీపీ అధినేత సీటు ఇవ్వరని…తేలడంతోనే.. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని, దానిలో భాగమే ఈ దీక్ష అని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఏదేమైనా.. టీడీపీకి రావెల‌తో అనుభందం తెగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మాజీ మంత్రి రావెల‌.. టీడీపీకి గుడ్‌బై!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share