జ‌గ‌న్‌కు కొత్త ఆయుధాలు అందించిన రేవంత్‌

October 20, 2017 at 12:09 pm
YS Jagan, YSRCP, Revanth reddy, TDP, Telangana

ఇప్ప‌టికే ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వివిధ అంశాల‌పై విరుచుకుప‌డుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కొత్త ఆయుధాలు అందాయా? అవి కూడా టీడీపీ సీనియ‌ర్ నేత రేవంత్ రూపంలో అంది వ‌చ్చాయా? ఈ నేప‌థ్యంలో బాబుపై జ‌గ‌న్ రెచ్చిపోవ‌డం ఖాయ‌మా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది విశ్లేష‌కుల నుంచి. బాబు ఏం చేసినా అందులో త‌ప్పు వెదికే జ‌గ‌న్‌కు ఇప్పుడు రేవంత్ చేసిన సంచ‌ల‌న కామెంట్లు మ‌రింత‌గా అందివ‌చ్చాయి. ప్ర‌ధానంగా త‌న‌పై పార్టీ మారుతున్న‌ట్టు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్‌.. త‌న మ‌న‌సులో బాధ‌ను మీడియా ముందు క‌క్కేశారు.

“మేం ఇక్క‌డ‌(తెలంగాణ‌లో) కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా రోడ్లెక్కి పోరు చేస్తంటే.. అక్క‌డ‌(ఏపీ) మీరు(టీడీపీ సీనియ‌ర్లు) ఆయ‌న‌కు(కేసీఆర్‌) చెక్క భ‌జ‌న చేస్తారా?“ అంటూ మొద‌లు పెట్టిన రేవంత్‌.. ఆ త‌ర్వాత త‌ర్వాత మాటల ధాటిని, విమ‌ర్శ‌ల వేడిని అనూహ్యంగా పెంచేశారు. దీంతో చాలా వివాదాస్ప‌ద అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. వాటిలో ప్ర‌ధాన మైన‌వి.. కేసీఆర్ నుంచి ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలు కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నారని మండిపడ్డారు. అదేవిధంగా త‌నకు మిత్రుడే అయిన ప‌య్యావుల కేశ‌వ్ అల్లుడు బీర్ త‌యారీ లైసెన్స్ పొందార‌ని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఈ కామెంట్లే.. ఇటు మీడియాలోనూ సంచ‌ల‌నంగా మారాయి. ఒక ప‌క్క తెలంగాణ ఏపీకి ద్రోహం చేస్తోంద‌ని చెబుతున్న టీడీపీ నేత‌లు.. ఇలా కేసీఆర్‌ను మ‌చ్చిక చేసుకుని కాంట్రాక్టులు కొట్టేయ‌డం అంటే బాబు రెండు కళ్ల సిద్ధాంతం మాదిరిగానే ఉంద‌ని అంటున్నారు. ఇక‌, ఇదే విష‌యంపై జ‌గ‌న్ రియాక్ష‌న్ కూడా తీవ్రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఎలాగూ ఆయ‌న న‌వంబ‌రు 2 నుంచి పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉండ‌డం స‌హజం. ఇక‌, ఇప్పుడు రేవంత్ చేసిన హాట్ కామెంట్లు మ‌రింత‌గా జ‌గ‌న్‌కు ఆయుధాలు అయ్యే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

జ‌గ‌న్‌కు కొత్త ఆయుధాలు అందించిన రేవంత్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share