రేవంత్‌రెడ్డి అక్ర‌మాస్తులు రూ.1000కోట్లు!

September 28, 2018 at 2:06 pm

కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కోడంగ‌ల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇళ్ల‌లో, స్నేహితులు, బంధువుల ఇళ్లు, కంపెనీల్లో ఐటీ బ‌`ందాలు చేప‌ట్టిన సోదాల్లో కళ్లుబైర్లు క‌మ్మే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. విస్తు గొలిపే విష‌యాలు వెల్ల‌డి అవుతున్నాయి. దేశంలోనేకాదు.. ఏకంగా విదేశాల్లోనూ ఆయ‌న ఆస్తులు, విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న‌ట్లు గుర్తించారు ఐటీ అధికారులు. ఇలా ఒక‌టికాదు రెండు.. ఏకంగా రూ.1000కోట్ల అక్ర‌మ ఆస్తులు రేవంత్‌రెడ్డి కూట‌బెట్టిన‌ట్లు ఐటీశాఖ అంచ‌నా వేస్తోంది.

భూముల కొనుగోలు ఆదాయాన్ని చూపించకపోవడం, ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం, ఎన్నిక‌ల‌ అఫిడవిట్లలో స్పష్టత లేకపోవడం తదితర కారణాలతో ఐటీ అధికారులు లోతుగా ప‌రిశీలిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక కొత్త విష‌యాలు తెలుస్తున్నాయి. రేవంత్‌కు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని, తద్వారా, కోట్ల రూపాయల మనీ లాండరింగ్‌ జరిగిందని గుర్తించింది. అనేక షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతానికి అధివ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.. రేవంత్‌ రెడ్డికి హాంకాంగ్‌, కౌలాలంపూర్‌ల్లో రెండు విదేశీ బ్యాంక్‌ ఖాతాలున్నాయి. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వీటి ద్వారా జ‌రిగిన లావాదేవీల విలువ భార‌త క‌రెన్సీ ప్ర‌కారం రూ.23.38కోట్లుగా అధికారులు గుర్తించారు. అయినా, వీటిని ఎన్నికల అఫిడవిట్‌, ఐటీ రిటర్న్స్‌ల్లో వీటిని చూపించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సింగపూర్‌, మలేషియాల్లోని బహుళ అంతస్తుల భవనాల విక్రయాలతో ఈ సొమ్ము వచ్చింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

అయితే.. ఇక్క‌డ ప‌లు ప్రశ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. అసలు రేవంత్‌ రెడ్డి విదేశాల్లో ఆస్తులు ఎలా సంపాదించార‌న్న విష‌యంలో ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. అలాగే, రేవంత్‌ రెడ్డి తన సోదరుడు కొండల్‌ రెడ్డితో కలిసి హవాలా పద్ధతిలో సొమ్మును దుబాయ్‌కు తరలించినట్లు ఆరోపణలున్నాయి. మరో సోదరుడు జగన్‌ రెడ్డి పేరుతో అమెరికాలో కూడా ఒక పెట్రోల్‌ బంక్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే.. వీటన్నింటికీ నిధులు ఎలా స‌మకూర్చార‌న్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. అంతేగాకుండా…సాయి మౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మరో 28 కంపెనీలను రేవంత్‌ రెడ్డి ఇంటి అడ్ర్‌సతో రిజిస్టర్‌ చేశారు. అయితే.. ఈ చాలావ‌ర‌కు ఈ కంపెనీల్లో ఎలాంటి లావాదేవీలు జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా రేవంత్‌ తన అనుచరులు, బినామీలు, బంధువుల పేర్లతో ఈ షెల్‌ కంపెనీలను సృష్టించి, సుమారు రూ. 200-300 కోట్లమేర మనీలాండరింగ్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మ‌రోవైపు.. అనేక ప్రాంతాల్లో రేవంత్‌రెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌కులకు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఐటీ దాడుల‌పై కాంగ్రెస్ నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఇది రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకే ఇలా దాడులు చేయిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. చూద్దాం మ‌రి ముందుముందు ఏం జ‌రుగుతుందో…

రేవంత్‌రెడ్డి అక్ర‌మాస్తులు రూ.1000కోట్లు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share