కేసీఆర్ కు ఝలక్..రేవంత్ ముందే రాజీనామా

September 6, 2018 at 12:48 pm

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీని ర‌ద్దు చేసి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు సీఎం కేసీఆర్‌. అయితే.. సీఎం కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసి, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు అందించ‌డానికి ముందే కోడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను మ‌ధుసూద‌నాచారికి అంద‌జేశారు. అందించనున్నారు. అసెంబ్లీ రద్దు కంటే ముందే తనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి… గతంలోనే రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి అందించారు. స్పీకర్‌కు లేఖ అందకపోవడంతో రాజీనామా ఆమోదం పొందలేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌ళ్లీ ఇప్పుడు రాజీనామా లేఖ‌ను స్వ‌యంగా స్పీక‌ర్‌కు అందించారు.

Revanth-Reddy-1

నిజానికి.. రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై, అందులోనూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ నుంచి కోడంగ‌ల్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆ ఎన్నిక‌ల్లో 15స్థానాల‌ను గెలుచుకుంది. అయితే సీఎం కేసీఆర్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో సుమారు 12మంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్‌లో చేరారు. అయితే అంద‌రికీ భిన్నంగా రేవంత్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓటుకు నోటు కేసుతో తెలంగాణ నుంచి చంద్ర‌బాబు వెళ్లిపోయి కేవ‌లం ఏపీకి ప‌రిమితం అయ్యారు. ఇదే స‌మ‌యంలో రేవంత్ పార్టీని వీడి రాహ‌ల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇది నిజంగా తెలంగాణ రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామంగా చెప్పారు అప్ప‌ట్లో. అయితే.. టీ కాంగ్రెస్‌లో ఆయ‌నకు ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప‌ద‌వి ఇవ్వ‌కున్నా..టీఆర్ఎస్‌పై మాత్రం విరుచుకుప‌డుతున్నారు.

Telangana-assembly-to-be-dissolved-tomorrow-CM-KCR-and-to-officials-signals-

ఇదే స‌మ‌యంలో కోడంగ‌ల్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ కూడా ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. కోడంగ‌ల్ నుంచి రేవంత్‌ను త‌రిమేందుకు ఏకంగా టీఆర్ఎస్‌లో ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు పొందిన మంత్రి హ‌రీశ్‌రావును రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్‌. ఇందులో భాగంగానే.. ఇటీవ‌ల ఐదుగురు మంత్రులు అభివ‌`ద్ధి ప‌నుల పేరుతో కోడంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. నిజానికి.. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్ తీరును ఏకిపారేసే నేత‌గా మాత్రం రేవంత్ గుర్తింపు పొందారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర‌లో రేవంత్‌రెడ్డి ప్ర‌సంగానికి క్యాడ‌ర్ నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న పోక‌డ పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్ల‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు ఇంకా ప‌ద‌వి ఇవ్వ‌లేద‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

కేసీఆర్ కు ఝలక్..రేవంత్ ముందే రాజీనామా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share