క‌ల‌కలం రేపుతున్న రేవంత్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

October 14, 2018 at 12:37 pm

త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. కొంద‌రు క‌లిసి త‌న‌ను చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్న త‌న‌కు మ‌రింత భ‌ద్ర‌త పెంచాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల రాష్ట్ర ప్ర‌ధాన అధికారికి వినతిప‌త్రం కూడా అందించారు. అయితే.. రేవంత్ ఇక్క‌డో మెలికి పెట్టారు. త‌న‌కు రాష్ట్ర పోలీసుల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని, కేంద్ర ప‌రిధిలోని సిబ్బందితో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆ వినతిలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

సెక్రటేరియట్ లో ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి కార్యాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన సెక్యూరిటీ పెంచాలంటూ వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం లేదని కేంద్ర సంస్థలకు చెందిన సెక్యూరిటీతో భద్రత కల్పించాలని కోరారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిపై అప న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌తీ విష‌యాన్ని కూడా రేవంత్‌రెడ్డి త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటున్నారు. నిత్యం వార్త‌ల్లో ప్ర‌ధానంగా ఉండేలా చూసుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న ఐటీ దాడుల నేప‌థ్యంలో టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌పై చేసిన ఆరోప‌ణ‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

తాజాగా.. త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ ఆయ‌న కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు. టీఆర్ఎస్ నేత‌లైన‌ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తనను అంతమొందిస్తామని అన్నారని… కాబట్టి కేంద్ర సెక్యూరిటీ సంస్థల నుంచి తనకు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రధానాధికారిని కోర‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా.. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ సభలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి పాల్గొంటున్నారని అందుకే ఆయనపై త‌నకు నమ్మకం లేక కేంద్ర సెక్యురిటీని కోరుతున్న‌ట్లు రేవంత్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా రేవంత్ రాష్ట్ర రాజ‌కీయాలు, అందులోనూ కాంగ్రెస్ శ్రేణులు త‌న‌చుట్టే ఉండేలా చూసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

అంతేగాకుండా.. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి వ‌ద్ద రేవంత్‌రెడ్డి మ‌రో కీల‌క అంశం కూడా ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎల్బీనగర్ లో పోటీ చేస్తే కోట్ల రూపాయలు ఇస్తామని బహిరంగంగా చెప్పిన విషయంపైన కూడా ఈసీకి కంప్లయింట్ చేశానని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఇది లంచం ఇవ్వచూపిన దాని కిందకి వస్తుందని..దీనిని సుమోటోగా స్వీక‌రించాల‌ని ఆయ‌న కోరిన‌ట్లు చెప్పారు. తన ఫిర్యాదుపై అయినా కేసు నమోదు చేయాలని అడిగాన‌ని పేర్కొన్నారు. అయితే… రేవంత్‌రెడ్డి విన‌తులు, ఫిర్యాదులుపై ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.

క‌ల‌కలం రేపుతున్న రేవంత్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share