ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో మోత్కుప‌ల్లి VS రేవంత్…. లోప‌ల ర‌చ్చ ర‌చ్చ‌

October 20, 2017 at 10:28 am
Revanth reddy, TDP leader Mothkupally Narasimhulu, Telangana, NTR Bhavan

తెలంగాణ టీడీపీలో రేవంత్‌రెడ్డి పార్టీ మార్పు వార్త ర‌చ్చ‌కు ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డే స‌చ‌న‌లు క‌న‌ప‌డ‌డం లేదు. కొద్ది రోజులుగా రేవంత్‌రెడ్డి పార్టీ మార‌తార‌ని వార్త‌లు రావ‌డంతో పాటు ఆయ‌న ఢిల్లీలో రాహుల్‌గాంధీని కూడా క‌లిశార‌ని వార్త‌లు రావ‌డంతో టీటీడీపీ ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యింది. తాజాగా ఇదే అంశం మీద చ‌ర్చించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సమావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా రేవంత్‌రెడ్డి అంశంమీదే చర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు నేత‌లు మీరు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఎందుకు క‌లిశారో చెప్పాల‌ని రేవంత్‌రెడ్డిని నిల‌దీశార‌ట‌. అయితే రేవంత్ కాంగ్రెస్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డాన్ని మోత్కుప‌ల్లి త‌ప్పుప‌ట్ట‌డంతో పాటు ఇందుకు చంద్ర‌బాబు అనుమ‌తి తీసుకున్నావా ? లేదా పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రెసిడెంట్ హోదాలో క‌లిశావా ? అన్న ప్ర‌శ్న‌లు వేయ‌డంతో వెంట‌నే చిర్రెత్తిపోయిన రేవంత్ నీ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అన‌డంతో పాటు నీకు అంత స్థాయి కూడా లేద‌ని ఆవేశంతో ఊగిపోయిన‌ట్టు స‌మాచారం.

ఇక మ‌రో నేత అర‌వింద్‌కుమార్ సైతం కాంగ్రెస్ నేత‌ల‌తో చ‌ర్చ‌ల‌పై రేవంత్‌రెడ్డిని నిలదీయ‌డంతో మీకు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం నాకు లేదు… నేను ఏదైనా చెప్పాల‌నుకుంటే చంద్ర‌బాబుకే చెపుతాన‌ని సీరియ‌స్‌గా చెప్ప‌డంతో షాక్ అయిన అర‌వింద్‌కుమార్ ఈ స‌మావేశం నుంచి వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఎలా సాధ్యమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ప్రశ్నించగా.. నేనెవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్‌ ఘాటుగా బదులిచ్చినట్టు సమాచారం.

లోప‌ల ఈ తంతు జ‌రిగితే బ‌య‌ట టీడీపీ నాయ‌కులు మాత్రం అసెంబ్లీ స‌మావేశాల్లో ఏం చ‌ర్చించాల‌నేదానిమీదే ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్టు చెప్ప‌డం కొస‌మెరుపు. ఇక పరిటాల సునీత, యనమలపై వ్యాఖ్యలను మోత్కుపల్లి ఖండించారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది.

Revanth-Reddy-Attends-TTDP-Working-Committee-Meeting-1508492631-188

 

ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో మోత్కుప‌ల్లి VS రేవంత్…. లోప‌ల ర‌చ్చ ర‌చ్చ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share