స‌ర్వే నిజాలతో.. బాబుకు మైండ్ బ్లాంక్‌!

June 18, 2018 at 4:42 pm
RG flash survey, Lagadapati rajgopal, chandra babu, TDP, 2019 elections

ఆర్జీస్ స‌ర్వే.. ప్ర‌స్తుతం ఏ ఇద్ద‌రు రాజకీయ నేత‌లు క‌లిసినా ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకుంటున్న విష‌యం ఇదే! కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ టీం పెద్ద ఎత్తున ఏపీలో నిర్వ‌హించిన ఈ స‌ర్వే తాలూకు ఫ‌లితం.. నిన్న విడుద‌ల చేశారు. అదికూడా ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో క‌టీఫ్ అయ్యాక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. కూడా బాబుతో బంధం తెంచుకున్నాక‌.,. ఈ స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 110 స్థానాలు ల‌భిస్తాయ‌ని ల‌గ‌డ‌పాటి ఇత‌మిత్థంగా చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అనే కాన్సెప్ట్‌తో ల‌గ‌డ‌పాటి నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో ఓటింగ్ స‌ర‌ళిపైనా ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌ర్వే చేయించారు.

ఇక‌, నిత్యం 18 గంట‌లు ప‌నిచేస్తున్నాన‌ని, నిద్ర‌పోయిన‌ప్పుడు త‌ప్ప మిగిలిన స‌మ‌యం అంతా కూడా.. తాను ప్ర‌జ‌ల కోసమే క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని బాబు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు, కొన్నాళ్ల కింద‌ట ఏపీలో మ‌రో ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఏపీ ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబు త‌న మ‌న‌వ‌డు, భార్య, కోడ‌లును సైతం హైద‌రాబాద్‌కే ప‌రిమితం చేశార‌ని, మ‌నుసును రాయి చేసుకుని ఏపీ ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు బాబుకు అత్యంత ప్రియ స‌న్నిహితుడు నిర్వ‌హించిన స‌ర్వేలో చంద్ర‌బాబు ప‌డుతున్న క‌ష్టానికి ప్ర‌జ‌లు మార్కులు వేసేశారు. నిజానికి ఏ ఎంసెట్టో.. చ‌దివే విద్యార్థి నిత్యం 10 గంట‌లు చ‌దివితే.. ఫ‌స్ట్ ర్యాంక్ ఖాయ‌మ‌ని అంటారు.

కానీ, ఇక్క‌డ ఈ స‌ర్వేలో మాత్రం బాబు రోజుకు 18 గంట‌లు ఎలాంటి లీవులు తీసుకోకుండా క‌ష్ట‌ప‌డుతున్నా.. 53 మార్కులే సంపాయించారు. అంటే సెకండ్ క్లాసేన‌న్న మాట‌! ఇక‌, ఆయ‌న ప‌థ‌కాలు, ప్ర‌భుత్వ పాల‌న‌కు ప్ర‌జ‌లు ఇచ్చిన మార్కులు కూడా చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారానికి పొంతన లేకుండా పోయింది. ఆయ‌న ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో స‌గం మంది కూడా హుషారు చూపించ‌డం లేద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఏ ప‌థ‌కాలూ అమ‌లు చేయ‌న‌ప్పుడే.. 108 సీట్లు కైవ‌సం చేసుకుంటే.. ఇప్పుడు ఇంత‌లా రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డుతుంటే.. 110 సీట్లు రావ‌డం కూడా విస్మ‌యానికి గురి చేస్తోంది.

ఈ స‌ర్వేని నిజం అనుకుంటే.. బాబు చేస్తున్న కృషి, చేస్తున్న ప్ర‌చారం అంతా కూడా ప్ర‌జ‌లు పెద్ద‌గా న‌మ్మ‌డం లేద‌ని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఉన్న ఓటు బ్యాంకును మించి బాబు ఓ నాలుగు అడుగులు కూడా ముందుకు వేసింది లేద‌ని తెలుస్తోంది. మ‌రి దీనిని బ‌ట్టి.. బాబు చెబుతున్న‌ట్టు ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయి 85% ఉంద‌ని అనుకునే అవ‌కాశం ఉందా? అంటే లేనేలేద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. సో.. మొత్తంగా ల‌గ‌డ‌పాటి స‌ర్వే నిజ‌మైతే.. బాబు చేసుకుంటున్న సంతృప్తి ప్ర‌చారం అబద్ధ‌మ‌నేది నిజ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా.. క్ష‌ణ‌క్ష‌ణ‌ముల్ ప్ర‌జ‌ల చిత్త‌ముల్‌..! అన్న‌ట్టుగానే ఉంది ప‌రిస్థితి.

స‌ర్వే నిజాలతో.. బాబుకు మైండ్ బ్లాంక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share