మ‌రీ ఇంత జుగుప్సాక‌రమా…రోజా వ‌ర్సెస్ బండ్ల‌

December 13, 2017 at 1:34 pm
Roja, ysrcp, bandla ganesh, tv 9, interview, live, comments

నువ్వు ప‌క్క‌లేసే వోడివి.. అని ఒక‌రు. అవును ప‌క్క‌లేస్తా.. వ‌స్తే నిన్నూ ప‌డుకోబెడ‌తా! మ‌ని మ‌రొక‌రు- సందుమూల‌ల్లో మునిసిపాలిటీ పంపుల ద‌గ్గ‌ర కూడా ఎవ‌రూ ఇలా తిట్టుకోరు. కానీ, ఇలా తిట్టుకొన్న మ‌న ఘ‌న‌త వ‌హించిన సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు.. ఆశ్చ‌ర్యంగా ఉందా! నిజం!! రాజ‌కీయాలు భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయ్.. అన‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ చాలు!  సెల‌బ్రిటీలుగా ఉన్న‌వాళ్లు.. ప్ర‌జాప్రాతినిధ్యంలో ప‌ద‌వుల్లో ఉన్న‌వారు సంయ‌మ‌నం కోల్పోతున్నారు. నోరు వావి తేడాలేకుండా మాట్లేడుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు ఒక‌ప్పుడు బుర‌ద జ‌ల్లుకునేవారు., కానీ నేడు బూతులు, బండ‌బూతులు జ‌ల్లుకుంటున్నారు. రాజ‌కీయ నేత‌లంటే ఇంత బ‌రితెగిస్తారా? అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా టీవీ-9షోలో వెలుగు చూసిన ఉదంతం ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌ను హ‌తాశుల‌ను చేసింది. ఒక‌రు సెల‌బ్రిటీ, మ‌రొక‌రు సెల‌బ్రిటీ కం ఎమ్మెల్యే ఈ క్ర‌మంలో వీరు ఎంత‌గా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి! అందునా ప‌బ్లిక్‌లో ఓ టీవీ ఛానెల్‌లో మాట్లాడేట‌ప్పులు ల‌క్ష‌ల మంది వీక్ష‌కులు ఉంటారు, వారు ప‌రిశీలిస్తారు అనే స్పృహ కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

తాజా ఘ‌ట‌న‌ను ప‌రిశీలిస్తే.. టీవీ -9 ఛానెల్ ఓ చ‌ర్చా వేదిక చేప‌ట్టింది. దీనికి నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ వ‌చ్చాడు. రాజ‌కీయాల‌పై జ‌రుగుతున్న చ‌ర్చ‌లో బండ్ల గ‌ణేష్ ఎందుకు పాల్గొన్నాడ‌నే సందేహం కామ‌న్‌. అయితే, ఈయ‌న ప‌వ‌న్‌కు వీరాభిమాని. జ‌న‌సేన జెండా మోసేందుకు రెడీగా సెల‌బ్రిటీ. దీంతో ఆయ‌న రాజ‌కీయచ‌ర్చ‌లో భాగ‌మ‌య్యాడు. ఇక‌, అటు వైపు లైన్‌లో వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా. సో.. ఇద్ద‌రూ కూడా సినీ వ‌ర్గానికి చెందిన వారే కాబ‌ట్టి కామెంట్లు కూల్‌గా  ఉంటాయ‌ని, పెద్ద‌గా ర‌చ్చ‌కాద‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, వాడి వేడిగా సాగింది వ్య‌వ‌హారం. ముందు రోజా మాట్టాడుతూ.. చిరంజీవిని నమ్ముకొచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టాలెంట్ లేదు.. అదీ ఇదీ అని రోజా నిప్పు ర‌గిల్చింది. ప‌వ‌న్ ని చిన్న మాటంటే ప‌డ‌ని బండ్ల గ‌ణేష్ రెచ్చిపోయాడు. నువ్వు గోల్డెన్ లెగ్‌వి. 

రాజ‌శేఖ‌ర్ రెడ్డిని పైకి పంపించేశావ్, ఇప్పుడు జ‌గ‌న్ ప‌క్క‌న చేరావ్ అక్క‌డే ఉండు.. అంటూ సెటైర్లు వేశాడు. దీంతో రోజా మ‌రింతగా రెచ్చిపోయింది.  ‘నువ్వు ప‌వ‌న్ ప‌క్క‌న ఉండి ప‌క్క‌లేస్తావా’ అంటూ అడిగేసింది. దానికి గ‌ణేష్ కూడా త‌గ్గ‌లేదు. ‘అవును నిన్నూ ప‌డుకోబెడ‌తా’ అన్నాడు. ప‌ళ్లు రాలిపోతాయ్ అని రోజా.. నీ ప‌ళ్లు రాల‌గొడ‌తా అంటూ బండ్ల గ‌ణేష్ ఒక‌రిపై ఒక‌రు విరుచుకుప‌డ్డారు. . ఓ బాధ్య‌తాయుత‌మైన శాస‌న స‌భ్యురాలిగా ఉంటూ, ప్ర‌తిప‌క్షంలో ముఖ్య నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తు… ఈ ‘ప‌క్క‌లేయ‌డం’ లాంటి ప‌దాలు వాడ‌డం రోజాకి స‌మ‌ర్థ‌నీయ‌మా? రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌డం గ‌ణేష్‌కి భావ్య‌మా?? ఇదీ ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కులు అడుగుతున్న ప్ర‌శ్న‌లు. మ‌రీ ఇంత జుగుప్సాక‌రంగా రాజకీయాలు మారిపోతాయ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. హ‌త విధీ!! 

మ‌రీ ఇంత జుగుప్సాక‌రమా…రోజా వ‌ర్సెస్ బండ్ల‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share