అమ్మ స‌బ్బం… బాబును ఇలా మేనేజ్ చేస్తున్నావా..!

July 21, 2018 at 5:11 pm
Sabbam Hari, on AP special Status, Comments, Chandra babu

రేపో మాపో టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని ప్ర‌చారంలో ఉన్న అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబును బాగానే వెనుకేసుకు వ‌చ్చారు. బాబు ఏం చేసినా గ్రేట్ అన్నారు. ఏపీ విషయంలో బాబు చిత్త శుద్ధిని ప్ర‌శ్నించేవారికే చిత్త శుద్ధి లేద‌ని తేల్చారు. మొత్తంగా బాబు నామ సంకీర్త‌న‌లో స‌బ్బం హ‌రి ఆసాంతం విజ‌యం సాధించా రు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదాలేదు. నిధులు అంద‌డం లేదు. ప్రాజెక్టులు పూర్తి కావ‌డం లేదు. రాజ‌ధాని విష‌యం ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితికి ఎవ‌రు కార‌ణం? అంటే ప్ర‌త్య‌క్షంగా కేంద్రం నిధులు ఇవ్వ‌డం లేదు.. రాష్ట్రాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టే.. అనే స‌మాధానం వ‌స్తుంది.

sabbam hari_0 (1)

అయితే, అదేస‌మ‌యంలో ప‌రోక్షంగా ఏపీలో అధికార టీడీపీకూడా కారణ‌మ‌ని అంటున్నాయి మిగిలిన ప‌క్షాలు.
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో రెండు నాల్క‌ల ధోర‌ణి అవలంబించిన చంద్ర‌బాబు కార‌ణంగానే ఏపీ ఇన్నిక ష్టాల్లో కూరుకుపోయింద‌ని వారు చెబుతున్నారు. మొద‌ట కావాల‌న్నారు. త‌ర్వాత వ‌ద్ద‌న్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల‌ని ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీని ఒప్పుకున్న నోటితోనే, తీసుకున్న చేత్తోనే.. ఇప్పుడు హోదా ఇచ్చి తీరాల‌ని మ‌డ‌త పేచీ పెడుతున్నారు.

మ‌రి ఈ విష‌యంలో ప్రాథ‌మిక త‌ప్పు ఏపీ అధికార పార్టీ నుంచే జ‌రిగింది. ఇప్పుడు చేస్తున్న ఈ యాగీ అంతా మొద‌టి నుంచి చేసి ఉంటే ఎంతో బాగుండే ద‌నేదిని నిపుణుల మాట‌. కానీ, చంద్ర‌బాబు అప్ప‌ట్లో మిత్ర‌త్వం నెరిపి.. ఇప్పుడు మాత్రం బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన/గ‌మ‌నిస్తున్న వారు చంద్ర‌బాబు వైఖ‌రిని త‌ప్పు పట్ట‌కుండా ఉండ‌లేరు. కానీ, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి మాత్రం బాబు దేవుడు అంటు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో ఉంచుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని ఆయన అభిప్రాయపడ్డారు.

08vzskp1CM-askGKU1IFV5S3jpg

ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకపోవడం, అనుకున్నంత మేరకు ప్రయోజనం లభించే అవకాశం లేదని గ్రహించి మళ్లీ ప్రత్యేక హోదా కోసమే పట్టుబట్టారని తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్యాకేజీకి అంగీకరించడం ఎంత సరైనదో… ప్రత్యేక హోదా కోసం మళ్లీ పట్టుబట్టాలని నిర్ణయించుకోవడం అంతే సరైనది! చంద్రబాబు రెండుసార్లూ సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ… బీజేపీయే రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేసింది’’ అని తెలిపారు. మొత్తానికి ఈ వ్యాఖ్య‌లు బాబును బాగానే మేనేజ్ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు తెచ్చిపెడుతున్నాయి.

అమ్మ స‌బ్బం… బాబును ఇలా మేనేజ్ చేస్తున్నావా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share