టీటీడీ చైర్మ‌న్ కావ‌డ‌మే.. శివాజీ లైఫ్‌గోల్‌!

November 1, 2018 at 10:29 am

యాక్ట‌ర్ నుంచి యాక్టివిస్ట్‌గా మారిన హీరో శివాజీ. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఆయ‌న చాలా కాలంగా పోరాడుతున్నాడు. ఏ పార్టీలో చేర‌కున్నా.. ఒంట‌రిగానే త‌న వాయిస్ వినిపిస్తున్నాడు. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై.. ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం, త‌దిత‌ర అంశాల‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆయ‌న నిల‌దీస్తున్నాడు. అయితే..ఇదే స‌మ‌యంలో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ఏపీలో తీవ్ర గంద‌ర‌గోళానికి దారి తీస్తున్నాయి. ఇక‌ ఆప‌రేష‌న్ గ‌రుడు పేరుతో ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌ని ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అయితే.. అస‌లు శివాజీ వెనుక ఎవ‌రు ఉన్నార‌న్న‌ది మాత్రం అస్స‌లు అంతుచిక్క‌డం లేదు.

Can-we-say-Hero-Sivaji-is-with-TDP

అయితే.. శివాజీ త‌న లైఫ్ గోల్ ఏమిటో చెప్పుకొచ్చాడు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చైర్మ‌న్ కావ‌డ‌మే త‌న ల‌క్ష్యమ‌ని ఆయ‌న అంటున్నాడు. ఆయ‌న గ‌తంలో టీటీడీలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌పై పోరాడాడు. తాను వేంక‌టేశ్వ‌ర‌స్వామికి ప‌ర‌మ భ‌క్తుడ‌న‌ని, ఆయ‌న సేవ‌లో త‌రిస్తాన‌ని చెబుతున్నాడు. తిరుప‌తికి త‌ర‌లివ‌స్తున్న కోట్లాది మంది భ‌క్తులు సుల‌భంగా గుట్ట‌పైకి చేరుకుని, స్వామిని ద‌ర్శించుకునేలా చేయ‌డానికి త‌న‌వ‌ద్ద ప్ర‌ణాళిక ఉంద‌ని అంటున్నాడు. ఒక‌వేళ‌.. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగితే.. శివాజీ చైర్మ‌న్ హోదాలో భ‌క్తుల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు చేస్తాడ‌న్న‌మాట‌. శివాజీ వ్యాఖ్య‌ల‌తో ఇక ఆయ‌న ఏదో ఒక పార్టీలో చేరుతాడ‌న్న‌ది మాత్రం ఖాయంగానే క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న శివాజీ.. ఆప‌రేష‌న్ గ‌రుడుపై కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు. డిసెంబ‌ర్ రెండో వారంలో ఇక్క‌డికి తిరిగి రానున్నాడు. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ త‌న‌ను ఆప‌రేష‌న్ గ‌రుడపై ప్ర‌శ్నించాల‌ని అనుకుంటే.. తాను స‌హ‌క‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని శివాజీ చెబుతున్నాడు. ఏదేమైనా.. చాలా ఏళ్లుగా ఒంట‌రిగా పోరు సాగిస్తున్న శివాజీ.. ఇక రాజ‌కీయ నేత‌గా మారేందుకు సిద్ధ‌ప‌డుతున్నాడ‌నీ.. అందులో భాగంగానే టీటీడీ చైర్మ‌న్ కావాల‌న్న పేరుతో ప‌రోక్ష సంకేతాలు ఇచ్చాడ‌నే టాక్ వినిపిస్తోంది. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కావాలంటే.. త‌ప్ప‌నిస‌రిగా అధికారంలో ఉన్న పార్టీ మ‌ద్ద‌తు కావాల్సిందే మ‌రి. చూద్దాం మ‌రి ఏం జ‌ర‌గుతుందో..!

టీటీడీ చైర్మ‌న్ కావ‌డ‌మే.. శివాజీ లైఫ్‌గోల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share