త్వ‌ర‌లో వెల్ల‌డి.. వైసీపీలోకి సోము..!

May 14, 2018 at 6:07 pm

రాజ‌కీయాల్లో అధికారం లేక‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ, అసంతృప్తి ఉంటే మాత్రం చాలా క‌ష్టం! దీనికి ఆ పార్టీ.. ఈ పార్టీ.. అనే ప‌ట్టింపు ఉండ‌దు. ఏ పార్టీ అయినా.. స‌రే అసంతృప్తి నేత‌లు వెంట‌నే త‌మ దారి తాము చూసుకుంటారు. ఇక‌, ఇప్పుడు ఇదే సూత్రాన్ని బీజేపీ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎంచుకున్నార‌ని స‌మాచారం. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. ఆయ‌నకు కారు చీక‌ట్లు, కుంభ వృష్టి బాధ‌ను మోసుకు వ‌చ్చింది. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న అజ్ఞాతంలో ఉన్నారు. విష‌యంలోకి వెళ్తే.. సోము వీర్రాజు.. బీజేపీకి ఏపీలో ఉన్న ఏకైక ఫైర్ బ్రాండ్ ఆయ‌నే. ప్ర‌ధానంగా అధికార టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని, దీనివ‌ల్ల పార్టీకే ముప్పు పొంచి ఉంద‌ని చెబుతూ వ‌చ్చిన ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీకి షాకిస్తూనే వ‌స్తున్నాడు. 

 

మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. మాకు టీడీపీతో ఒరిగింది ఏమీ లేద‌ని సోము విమ‌ర్శించారు. కాకినాడ ఎన్నిక‌ల విష‌యం లో చంద్ర‌బాబు అనుస‌రించిన వైఖ‌రిపైనా విరుచుకుప‌డ్డారు. కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేద‌న్న టీడీపీ నేత‌ల కామెంట్ల‌పైనా సోము గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీని అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబును విమ‌ర్శించేందుకు సాహ‌సించ‌ని బీజేపీ నేత‌ల‌ను సైతం ఆయ‌న తెర‌చాటుగా దుయ్య‌బ‌ట్టారు. అలాంటి నేత‌.. ఏపీ బీజేపీకి అధ్య‌క్షుడు కావాలనిక‌ల‌లు క‌న్నాడు. అంతేకాదు, తాను కాపు వ‌ర్గం కాబ‌ట్టి.. త‌న‌కు అవ‌కాశం ఇస్తే.. జాతీయ పార్టీగా బీజేపీకి కాపులు అండ‌గా నిలుస్తార‌ని కూడా సోము ప‌లు వేదిక‌ల‌పై చెప్పుకొచ్చాడు. అయితే, అనూహ్యంగా ఈప‌ద‌వి.. క‌న్నాను వ‌రించింది. దీంతో సోము.. తీవ్రంగా మ‌ధ‌న ప‌డ్డారు. 

 

అనూహ్య ప‌రిణామంతో ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. బీజేపీ అధిష్టానానికి అత్యంత విధేయుడు కావ‌డం, ఆర్ ఎస్ ఎస్‌తో ప‌రిచ‌యాలు ఉండ‌డంతో ఓ ర‌కంగా సోముకు నోరు క‌ట్టేసినంత ప‌నైంది. ఈ క్ర‌మంలోనే ఆయన స‌హ‌చ‌రులు ఇప్ప‌టికే పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకొంటున్నామ‌ని చెప్పారు.  అయితే, తెర‌చాటుగా మాత్రం ఇప్పుడు సోము.. ఏకంగా బీజేపీకే ఝ‌ల‌క్ ఇచ్చేలా చ‌క్రం తిప్పుతున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రిలో పాద‌యాత్ర‌లో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను క‌లిసి ఆ పార్టీలో చేరాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. 

 

అయితే, దీనికి వైసీపీ నాయ‌కులు రాయ‌బారం చేసిన‌ట్టు చెబుతున్నా రు. ఇప్పుడు ఎలాగూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అయ్యే అవ‌కాశం సోము లేదు కాబ‌ట్టి.. ఇలాంటి నోరున్న ఫైర్ బ్రాండ్‌ను అందునా కాపు వ‌ర్గానికి చెందిన నేత‌ను పార్టీలోకి తీసుకుని కీల‌క‌మైన ప‌ద‌విని అప్ప‌గించ‌డం ద్వారా వైసీపీ వైపు కాపుల‌ను మ‌ళ్లించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోము వారు రెడ్ కార్పెట్ ప‌ర‌వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దీనికి సోము ఓకే చెప్ప‌డం ఒక్క‌టే త‌రువాయిగా ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.  

 

త్వ‌ర‌లో వెల్ల‌డి.. వైసీపీలోకి సోము..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share