ఎస్వీకి టికెట్ ఖ‌రారు.. భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు!

July 22, 2018 at 12:27 pm
SV Mohan reddy, MLA ticket, confirmed by Lokesh, Bhuma Akhila Priya family, tense

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఏదొ ఒక వివాదం కొన‌సాగుతూనే ఉంటోంది. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఆ ఫ్యామిలీ రాజ‌కీయాలు ఎప్పుడూ వార్త‌ల్లో క‌(వి)నిపిస్తూనే ఉన్నాయి. ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్సెస్ భూమా అఖిల ప్రియల వివాదం కొన్ని నెల‌ల పాటు సీరియ‌ల్‌గా సాగింది. ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఈ వివాదం.. ఇప్పుడు భూమా ఫ్యామిలీని నిద్ర‌పోనివ్వ‌డం లేదు. విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు అసెంబ్లీ టికెట్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్వీమోహ‌న్ రెడ్డికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించి బాంబు పేల్చారు. అంతేకాదే, ఆయ‌న‌ను గెలిపించాల‌ని కూడా పిలుపునిచ్చారు.

07ONGPAGE_6_NAI+07ONGPAGE_6_NAIDU.j

ఈ ప‌రిణామం.. ఇక్క‌డి నుంచి టికెట్ ఆశిస్తున్న ఎంపీ టీజీ వెంక‌టేష్ వంటి వారిక‌న్నా కూడా ఎస్వీ మోహ‌న‌రెడ్డి బంధు వులు అయిన భూమా అఖిల ప్రియ ఫ్యామిలీని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. మోహన్‌ రెడ్డికి టికెట్‌ ఖరారు చేయడం అంటే.. అటు భూమా కుటుంబంలోని ఎవరో ఒకరికి టికెట్‌ దక్కకపోవడానికి సంకేతమ‌ని కర్నూలు రాజకీయ విశ్లేషకు లు అంటున్నారు. ప్రస్తుతానికి ఎస్వీ కర్నూలు ఎమ్మెల్యేగా, ఈయన మేనకోడలు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరూ వైసీపీ తరఫున ఎన్నికైన వాళ్లే. అయితే, చంద్ర‌బాబు ఆక‌ర్ష్‌లో భాగంగా వారు పార్టీని ఫిరాయించారు. ఇక భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఎస్వీకి టికెట్‌ ఖరారు అయ్యిందని అంటే.. భూమా ఫ్యామిలీలో ఒక‌రికి టికెట్ క‌ట్ అయింద‌నే అనుకోవాలి.

30-1504070131-bhuma-akhila-priya-brahmananda-reddy-new-681

మోహ‌న్‌రెడ్డికి టికెట్‌ ఇస్తున్నారంటే.. అఖిలప్రియ లేదా బ్రహ్మానందరెడ్డి సీట్లకు ఎసరేనని.. వీరిలో ఎవరో ఒకరికి మొండిచేయి తప్పకపోవచ్చని… ఒకే కుటుంబం అనిపించే వీళ్లందరికీ సీట్లు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి అఖిలప్రియకే చంద్రబాబు మొండిచేయి చూపినా, ఆమెతో పాటు బ్రహ్మానికి కూడా నో టికెట్‌ అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో అఖిలప్రియ తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. మంత్రిగా ఆమె పెర‌ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్వీకి టికెట్‌ ఖరారు అని లోకేష్‌ ప్రకటన చేయడం.. అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిల టికెట్లకు మరో ప్రశ్నార్థకాన్ని తెచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.

ఎస్వీకి టికెట్ ఖ‌రారు.. భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share