దత్తా వర్సెస్ తలసాని..సంచలనమే

October 2, 2018 at 12:27 pm

తెలంగాణ రాజ‌కీయాలు ఊహ‌కంద‌ని రీతిలో సాగుతున్నాయి. బ‌య‌ట‌కు ఎవ‌రి ముచ్చ‌ట వారు చెబుతున్నా.. లోలోప‌ల ఎవ‌రితో ఎవ‌రు క‌లిసిపోతున్నారో అర్థంగాని స్థితి ఉంది. ఇందులో ప్ర‌ధానంగా టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య బంధ‌మే ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఈ రెండు పార్టీలు కుమ్మ‌క్కు అయ్యాయ‌ని కాంగ్రెస్‌, టీడీపీ త‌దిత‌ర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆరోప‌ణ‌ల‌కు బ‌లాన్నిఇచ్చేలా కేసీఆర్ నిర్ణ‌యాలు ఉంటున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నం.. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 105మంది పార్టీ అభ్య‌ర్థుల్లో గ్రేట‌ర్‌లో బీజేపీ ప్రాతినిధ్యం వ‌హించిన సిట్టింగ్ స్థానాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ్రేట‌ర్లో బీజేపీకి ఐదు స్థానాలు ఉండ‌గా.. ఇందులో ఒక్క స్థానానికి మాత్రమే కేసీఆర్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు.

dc-Cover-79nuniqr44och5v3388hl8mcu7-20160129021550.Medi

బీజేపీతో కేసీఆర్ ఓ అవ‌గాహ‌న వ‌చ్చార‌నే టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే.. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి.. ప‌రోక్షంగా బీజేపీ అభ్య‌ర్థుల గెలుపుకు స‌హ‌క‌రించడం. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎలాంటి అవ‌రోధాలు ఎదురుకాకుండా మోడీ హామీ ఇచ్చార‌నీ.. దీనికి ప్ర‌తిఫ‌లంగా వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి స‌హ‌క‌రించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నార‌నే వాద‌న బ‌లంగానే వినిపిస్తోంది. అయితే.. కేసీఆర్ క‌ద‌లిక‌లు కూడా ఇందుకు బ‌లాన్ని ఇచ్చేలా ఉన్నాయి. అయితే.. ఇదిలా కొన‌సాగుతుండ‌గానే ఇందులో స‌రికొత్త ట్విస్ట్ ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. గ్రేటర్లోని స‌న‌త్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరుకు తెర‌లేచే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ స‌న‌త్‌న‌గ‌ర్ నిజ‌యోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక్క‌డి నుంచి రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. స‌న‌త్‌న‌గ‌ర్‌లో త‌ల‌సాని, బండారు మ‌ధ్య హోరాహీరీ పోరు ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇందుకు బండారు కూడా సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ర‌హ‌స్య అవ‌గాహ‌నే కుదిరితే.. ఇలా పోటీ ఎందుకు ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌దుకానీ.. ఈ ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతోంది. త‌ల‌సానికి ఓడించేందుకు బీజేపీ ప‌క్కాప్లాన్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

దత్తా వర్సెస్ తలసాని..సంచలనమే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share