టీడీపీ లోక్ సభ కొత్త అభ్యర్థులు జాబితా…సగం కొత్త మొఖాలే!

October 3, 2018 at 3:36 pm

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. ముఖ్యంగా లోక్‌స‌భ స్థానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా 25 స్థానాల్లో విజ‌యం సాధించి, ప్ర‌ధాని ఎవ‌రు కావావో తామో నిర్ణ‌యిస్తామ‌ని చంద్ర‌బాబు ప‌లుమార్లు ప్ర‌స్తావించిన విష‌యం తెల‌సిందే. ఈ మేర‌కు ఆయ‌న వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా 25లోక్ స‌భ స్థానాల్లో స‌గానికి స‌గం స్థానాల్లో కొత్త‌వారిని బ‌రిలోకి దించాల‌న్నయోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీల్లో కొంద‌రిని ప‌క్క‌నే పెట్టాల‌ని, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారిలో కూడా కొంద‌రికి ఈసారి టికెట్లు ఇవ్వొద్ద‌న్న ఆలోచ‌న‌కు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

fuel-prices

ఈ దిశ‌గా సాగుతున్న చంద్ర‌బాబు క‌ద‌లిక‌ల‌తో పార్టీవ‌ర్గాల్లో ఒకింద క‌ల‌వ‌రం మొద‌లైంద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి విశాఖ‌, నరసాపురం, రాజంపేట, తిరుపతి సీట్ల‌ను కేటాయించింది టీడీపీ. ఈసారి ఆ సీట్లలో టీడీపీనే పోటీ చేయ‌నుంది. ఇక‌ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అనారోగ్య కార‌ణాల రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక్క‌డ కొత్త‌వారి కోసం పార్టీ వెతుకుతోంది. ఎస్పీవై రెడ్డి స్థానంలో ఎవ‌ర‌నే విష‌యంలో ఇంకా స్పష్టత లేదు. గత ఎన్నికల్లో పోటీచేసిన వారిలో సుమారు ప‌ది నుంచి 12మంది మళ్లీ బరిలోకి దిగడం ఖాయమేనని తెలుస్తోంది. అయితే వీరిలో కొందరు సిట్టింగులు, మరికొందరు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారు. దీంతో ఈ స్థానాల్లో క్లారిటీ వ‌చ్చిన‌ట్టేన‌ని పార్టీవ‌ర్గాలు అంటున్నాయి.

సిట్టింగ్ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు(శ్రీకాకుళం), అశోక్‌ గజపతిరాజు(విజయనగరం), పండుల రవీంద్రబాబు(అమలాపురం), మాగంటి బాబు(ఏలూరు), కేశినేని నాని(విజయవాడ), కొనకళ్ల నారాయణరావు(మచిలీపట్నం), గల్లా జయదేవ్‌(గుంటూరు), శ్రీరాం మాల్యాద్రి(బాపట్ల), శివప్రసాద్‌(చిత్తూరు), బుట్టా రేణుక(కర్నూలు) మ‌ళ్లీ చేయ‌డం ఖామ‌ని తెలుస్తోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలులో పోటీ చేసి ఓడి న మాగుంట శ్రీనివాసులరెడ్డికే మ‌ళ్లీ టికెట్ ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మిగ‌తా చోట్ల మాత్రం కొత్త‌వారికే అవ‌కాశం క‌ల్పించేందుకు చంద్ర‌బాబు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. అరకు లోక్‌స‌భ స్థానానికి ఒక ఉన్నతాధికారి పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ సీట్లో కూడా కొత్త అభ్య‌ర్థికే ఛాన్స్.

ఇక్క‌డ ఇద్ద‌రు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. దివంగ‌త‌ ఎంవీవీఎస్ మూర్తి మనవ డు భరత్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరుతోపాటు మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. బీజేపీ ఎంపీ గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురంలో ఎవ‌రిని దించాల‌న్న విష‌యంలో చంద్ర‌బాబు క్లారిటీగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజును నిలపనున్నట్లు సమాచారం. ఇక‌ కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈసారి అసెంబ్లీకి పోటీ చేసే అవ‌కాశాలు ఉండ‌డంతో ఆ సీటును చలమలశెట్టి సునీల్‌కు ఇచ్చే యోచనలో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాయపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేటలో ఈసారి టీటీ డీ చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు, అటవీశాక‌ మం త్రి సిద్ధా రాఘవరావు, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి.

తిరుపతి(ఎస్సీ)లో ఈసారి టీడీపీ త‌న సొంత‌ అభ్యర్థిని నిలపనుంది. పోయినసారి అక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి జయరాజ్‌ తర్వాత టీడీపీలో చేరుతార‌నీ..ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన కుమారుడు పవన్‌ రెడ్డికి అవకాశమివ్వాలని చంద్రబాబును కోరారు. ఇక‌ హిందూపురం ఎం పీ నిమ్మల కిష్టప్ప ఒక‌వేళ అసెంబ్లీకి వ‌స్తే… ఆయ‌న స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశం వ‌స్తుంది. ఇదిలా ఉండ‌గా.. మంత్రి ఆదినారాయణ రెడ్డి.. మండలిలో ప్రభుత్వ విప్‌ పి.రామసుబ్బారెడ్డిల్లో ఒకరిని కడప ఎంపీగా నిలపాలన్న యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజంపేటలో పోయినసారి బీజేపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అక్కడ ఎమ్మెల్సీ చెంగల్రాయుడిని నిలపాలని ఆయ‌న చూస్తున్నార‌ట‌.

టీడీపీ లోక్ సభ కొత్త అభ్యర్థులు జాబితా…సగం కొత్త మొఖాలే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share