ప్చ్‌..టీడీపికి అభ్య‌ర్థులు దొర‌క‌ట్లేద‌ట‌!

February 9, 2019 at 11:54 am

ఇది విన్నారా….! టీడీపీకి లోక్‌స‌భ అభ్య‌ర్థులు దొర‌క‌డం లేదంట‌…ఎమ్మెల్యేగా అయితే పోటీ చేస్తాం కాని…ఎంపీగా వ‌ద్దంటూ తిర‌స్క‌రిస్తున్నార‌ట‌.
అసెంబ్లీ టికెట్ కోసం పార్టీ నేత‌లు రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు పెడుతున్నార‌ట‌. ఎంపీ అంటే హోదా త‌ప్ప చివ‌రికి ఏం మిగ‌ల‌డం లేద‌న్న‌ది వీరి భావ‌న‌ట‌. అందుకే ఈ సారి ఎలాగైనా అసెంబ్లీ సీటు ద‌క్కించుకుని కాస్త ఖ‌ర్చు రిస్క్ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. అస‌లే ప్ర‌భుత్వానికి ఎదురుగాలి వీస్తున్న నేప‌థ్యంలో ఈ సారికి న‌న్ను కాస్త ప‌క్క‌న పెట్టండి సార్ అంటూ చంద్ర‌బాబుకే ఝ‌ల‌క్ ఇస్తున్నార‌ట‌. అదేంటి మీ లాంటి సీనియ‌ర్లే లోక్‌స‌భ‌లో మ‌న‌కు అవ‌స‌రం అంటూ చంద్ర‌బాబు బుజ్జ‌గించినా ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేదు..అసెంబ్లీలో అయితే ఎట్టాగోలా నెట్టుకొస్తా…సొంత ప్రాంతానికి ఎంతో కొంత సేవ చేశాన‌నే త‌`ప్తి ఉంటుంది అందుకే ఈ సారి నాకు ఆ సీటు ఇప్పించండి అంటూ ప్రాధేయ‌ప‌డుతున్నాడ‌ట‌.

_a012f256-0692-11e7-b6aa-1ca3b6953a4e

నేత‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే…ఈ ర‌క‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌తో వైసీపీకి ధీటుగా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు చంద్ర‌బాబుకు అభ్య‌ర్థులు దొర‌క‌డం లేద‌ని స‌మాచారం. అందుకే ఆయ‌న కూడా పారిశ్రామిక వేత్త‌లు..ప‌లువురు ప‌క్క పార్టీలో ఉండి టికెట్ ద‌క్కే అవ‌కాశం లేని వారికి ఆఫ‌ర్ చేస్తూ ఆహ్వానాలు పంపుతున్న‌ట్లు స‌మాచారం. ఆహ్వానాలు అందుకున్న అభ్య‌ర్థులు కూడా అన్ని విధాలుగా బేరీజు వేసుకుని ఇప్ప‌ట్లో టీడీపీకి దూరంగా ఉండ‌ట‌మే బెట‌ర‌నే నిర్ణ‌యానికి వ‌చ్చి…సారీ సార్ మ‌రోసారి చుద్దాం..అంటూ దీర్ఘాలు తీస్తుండ‌టంతో చంద్ర‌బాబుకు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ట‌.

ఎంపీగా గెలిచిన పెద్ద‌గా ఉప‌యోగ‌ముండ‌ద‌న్న‌ది కొంత‌మంది నాయ‌కుల ఆలోచ‌న‌గా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లోనూ మోదీయే మళ్లీ గెలిచే పరిస్థితులున్నాయని అర్థం చేసుకుంటున్న ఎంపీలు అలాంటప్పుడు ఎంపీలుగా గెలిచి లాభం లేదని భావిస్తున్నారట. అధికారంలో ఉన్న కూటమి నుంచి ఎంపీలుగా లేకపోవడం ఒకెత్తయితే.. చంద్రబాబుపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉండడం కూడా వారి భయానికి కారణమని తెలుస్తోంది. వివిధ వ్యాపారాలు చేసుకునే ఎంపీలకు కేంద్రంలో ఇప్పుడు ఏమాత్రం మాట చెల్లుబాటు కాకపోవడంతో ఎంపీగా ఉండి లాభం లేదని చాలామంది భావిస్తున్నారట. దానికి బదులు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండడం నయమని.. అదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం కనుక మళ్లీ గెలిస్తే మంత్రి పదవి అడగొచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తాడో..!

ప్చ్‌..టీడీపికి అభ్య‌ర్థులు దొర‌క‌ట్లేద‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share