ఈ నేతలు మాకొద్దు బాబోయ్…పశ్చిమలో రచ్చ రచ్చ!

November 8, 2018 at 11:36 am
TDP, BJP, Tadepalligudem, Mullapudi Bapiraju, Manikyal rao

ఏపీలో టీడీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం చేతల‌దాకా వెళ్తుందా..? అంటే తాజా ప‌రిస్థితులు ఔన‌నే అంటున్నాయి. నాలుగేళ్ల‌పాటు బీజేపీ, టీడీపీలు క‌లిసి న‌డిచిన రోజుల్లోనూ.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇరుపార్టీల నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త‌లేదు. అప్పుడు కూడా ఉప్పునిప్పులానే ఉన్నారు. ఇక ఎప్పుడైతే ఎన్టీయే నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చారో.. అప్ప‌టి నుంచి వారి మ‌ధ్య అయింత సంబంధాలు కూడా లేకుండా పోయాయి. ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా బీజేపీ న‌మ్మ‌క ద్రోహం చేసిందంటూ టీడీపీ నాయ‌కులు స‌న్నాయి రాగాలు తీస్తున్నారు. అభివృద్ధి విష‌యంలో ఇరువ‌ర్గాలు త‌ర‌చూ మాట‌ల‌యుద్ధానికి దిగుతున్న విష‌యం తెలిసిందే.

636772691884387844

ఈ క్ర‌మంలోనే అభివృద్ధిపై చర్చకు టీడీపీ, బీజేపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం స‌వాలుచేసుకోవ‌డంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చర్చలో పాల్గొనేందుకు వెంకటరామన్నగూడెం చేరుకున్న జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావును కూడా తాడేపల్లిగూడెంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఇరువ‌ర్గాలను ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించాయి.

నిజానికి.. టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూడా తాడేపల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఎన్న‌డు కూడా స‌ఖ్య‌త వాతావ‌ర‌ణం లేదు. తాజా ప‌రిస్థితుల‌తో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మ‌రింది. నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధి చేసిందని, అడ్డుకోలేదని…ఈ విషయంలో మాణిక్యాలరావుతో చర్చకు సిద్ధమని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెబుతున్నారు. ఈ సవాల్‌ను స్వీకరించిన మాణిక్యాలరావు చర్చకు ఎక్కడైనా సిద్ధమని ప్రకటించారు. అభివృద్ధిపై చర్చకు ఇరువర్గాలు వెంకటరామన్నగూడెంను వేదికగా చేసుకున్నాయి. ఇరు పార్టీల నేతలు ఉదయం పది గంటలకు టైం పెట్టుకున్నారు.

అయితే ఈ చర్చతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిగూడెంలో 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ముందస్తు చర్యగా అటు ఎమ్మెల్యేను, ఇటు జెడ్పీ చైర్మన్‌ను గృహనిర్బంధం చేశారు. ఇదిలా ఉండ‌గా.. స్థానిక ప్ర‌జ‌లు మాత్రం టీడీపీ, బీజేపీ నేత‌ల తీరుపై మండిప‌డుతున్నారు. ఇరుపార్టీలు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా అన్యాయం చేశాయ‌ని, ఇప్పుడు ఎన్నిక‌ల ముంగిట ఓట్ల కోసం నాట‌కాలు ఆడుతున్నాయ‌ని మండిప‌డుతున్నారు. వీళ్లు ఎన్నిక‌ల నాట‌కాలు ఆడినా.. తాము న‌మ్మే ప‌రిస్థితిలో లేమ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ధి చెబుతామ‌ని అంటున్నారు.

ఈ నేతలు మాకొద్దు బాబోయ్…పశ్చిమలో రచ్చ రచ్చ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share