టీడీపీ-కాంగ్రెస్‌లకు జరగబోయేది అదే..!

January 9, 2019 at 12:59 pm

జోగి జోగి రాసుకుట్టే బూడిదైన రాలుతుందేమో కాని చంద్రబాబు రాహుల్ గాంధీ రాసుకు పూసుకు తిరిగితే ఓట్లు రాలవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావారణం వచ్చేసిన నేపథ్యంలో రాహుల్‌గాంధీతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కోల్‌కతలో కలుద్దామని రాహుల్‌గాంధీ చెప్పగానే చంద్రబాబు సరేననడంపై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అటు టీడీపీకి..ఇటు కాంగ్రెస్‌కు వేరే గత్యంతరం లేకనే పొత్తు కూడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా తీవ్రమైన ఎదురీతను చంద్రబాబు ఇప్పుడు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. బీజేపీతో పూర్తిగా చెడటంతో సొంతంగా వైసీపీని ఎదుర్కొనే సత్తా ఇప్పుడు టీడీపీకి లేదని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ఇక పవన్‌తో ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు.

imagebe810d22-679f-41e2-9972-ea5e9f9d53cd

చేసేదేం లేక కాంగ్రెస్‌తో జత కట్టాలని చంద్రబాబు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకనే భవిష్యత్ రాజకీయ ప్రణాళికతో రాహుల్‌గాంధీ వద్దకు చంద్రబాబు పరుగులు పెడుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. గత ఎన్నికల్లో మహామహులు పార్టీని విడిచి పలాయనం చిత్తగించారు. ఉన్న కొద్ది మంది పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. డిపాజిట్లు కూడా రాకపోవడంతో చిన్న చిన్న నేతల ముందు..కొత్తతరం నాయకుల ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇక అనుభవజ్ఞుడు అన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ చంద్రబాబు వైపు ప్రజలను మొగ్గేలా చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏమాత్రం ఆ అంచనాలు అందుకోలేకపోయారు.

అమరావతి అభివ`ద్ధి అదిగో ..ఇదిగో..అంటూ కాలం వెళ్లదీశారనే విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివ`ద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ప్రచారం చేస్తూ వచ్చారు. కేంద్రంతో కలసి ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి ఆయన తెచ్చిన నిధులు..మంజూరీలు..పెద్దగా ఏమీ లేవని తలంటూ పోస్తున్నారు ప్రజలు. ప్రజలే ప్రతిపక్షంగా మారిన తరుణంలో టీడీపీకి గడ్డుకాలంగా మారింది. ఇక కాంగ్రెస్‌తో పొత్తు అంటే తెలుగు ప్రజలెవరు హర్షించడం లేదు. సొంత పార్టీలో అధినేతను ఎదురించలేక…పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయి నేతలు ఉండటం ఆ పార్టీకి డేంజర్ బెల్స్‌ను మోగిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు నాటికి ఇది మరింత పెరిగి పార్టీ వీక్ అవుతుందనే అభిప్రాయమే ఎక్కువుతుందన్నది విశ్లేషకుల మాట. బాబు చాణిక్యం..గిమ్మిక్కులను ఈసారి ప్రజలను నమ్మరని చెబుతున్నారు. మరి బాబు కళ్లు తెరిచి పరిస్థితిని గమనించి ఆ విధంగా ముందుకెళ్దామంటాడో లేదో వేచి చూడాలి.

టీడీపీ-కాంగ్రెస్‌లకు జరగబోయేది అదే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share