మా కొద్దు బాబూ.. నామినేటెడ్ పోస్టులు!

August 6, 2018 at 12:43 pm
TDP Leaders, Are not interested, to take nominated posts, chandra babu

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చాణక్య తెలివితేటల అస్త్రాలను ఇప్పుడు బయటకు తీస్తున్నారు. పార్టీ మీద విపరీతమైన అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులకు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతున్నారు.సాధారణంగా నామినేటెడ్ పోస్టులంటే.. ఏ పార్టీ ప్రభుత్వం రాజ్యం చేస్తున్నప్పటికీ.. ఆ పదవులకోసం పలువురు ఎగబడుతూ ఉంటారు. ఏదో ఒక పదవి దక్కితే.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చునని ఆరాటపడుతూ ఉంటారు.

కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్జితిని గమనించినప్పుడు… పదవులు ఇస్తాం అంటూ ఉంటే.. నాయకులు ‘మాకొద్దు మొర్రో’ అని మొత్తుకుంటున్నట్లుగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు మహా అయితే.. ఆరునెలల గడువు మాత్రమే ఉంది. ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో జగన్మోహన రెడ్డి పాదయాత్రకు జనం నీరాజనం పడుతుండడం, అలాగే గత ఎన్నికల్లో కాపు కుల ఓట్లను తెలుగుదేశానికి వేయించడంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ సొంత పార్టీతో బరిలో పోటీగా ఉండడం తెలుగుదేశానికి దెబ్బే.

ఇలాంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా మళ్లీ అధికారంలోకి వస్తాం అనుకోవడం కల్ల. కానీ, ఇప్పుడు బాబు దయ పెడుతున్న నామినేటెడ్ పదవులు పుచ్చుకుంటే… ఎన్నికల్లో కోట్ల రూపాయల ఖర్చును తమ నెత్తిన రుద్దుతారని నాయకులు భయపడుతున్నారు. ఈ నామినేటెడ్ పదవుల్ని దక్కించుకోవడం వల్ల.. ఎన్నికల్లోగా తాము సంపాదించుకోగలిగే దానికంటే.. ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిన మొత్తమే ఎక్కువ అవుతుందని భయపడుతున్నారు.

చంద్రబాబు కనీసం ఓ ఏడాది ముందుగా ఈ పదవులు పంచి ఉన్నా బాగుండేదని.. కానీ.. పార్టీ కార్యకర్తలు బాగు పడడం తనకు ఇష్టం ఉండదన్నట్లుగా.. ఆయన ఇన్నాళ్లూ పదవుల్ని ఖాళీగా పెట్టుకున్నారే తప్ప.. భర్తీ చేయలేదని అసంతృప్తి పార్టీలో ధ్వనిస్తోంది.అందుకే.. మాకొద్దు బాబూ.. ఈ నామినేటెడ్ పోస్టులు అని వారు పరోక్షంగా మొత్తుకుంటున్నారట.

మా కొద్దు బాబూ.. నామినేటెడ్ పోస్టులు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share