టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల బీభ‌త్సం.. ఏం జ‌రిగింద‌ని?

July 21, 2018 at 4:52 pm
TDP, Leaders, at parliament, No Confidence Motion, Speeches

టీడీపీ నేత‌లు రెచ్చిపోయారు. ఏనాడూ లేని విధంగా రోడ్ల‌పైకి కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌నతో కుమ్మేశారు! అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ఫోజులు ఇచ్చారు. పైకి చూసేందుకు బాగానే ఉన్నా..కేంద్రంలో టీడీపీ చేసింది శూన్యం. కానీ, ఏపీలో మాత్రం నేత‌ల మాట‌లు కోట‌లు దాటిపోయాయి ఎవ‌రెవ‌రు ఏమ‌న్నారో చూద్దాం.. అధికార గర్వంతో విర్రవీగుతున్న బీజేపీని అవిశ్వాస తీర్మానంతో వణికించాం. ఇది చరిత్రలో గుర్తు పెట్టుకునే రోజు. వైసీపీ నాయకుడు జగన్‌ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడం కోసం బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు అని విజ‌యవాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పుకొచ్చారు. ఇక‌, పెన‌మ‌లూరు ఎమ్మ‌ల్యే బోడే ప్ర‌సాద్ మ‌రో అడుగు ముందుకు వేసి.. సంచ‌ల‌న‌, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను ర‌క్తి క‌ట్టించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంటులో వీరోచితంగా పోరాడుతుంటే.. వైసీపీ ఎంపీలు ఉత్తర కుమారుల్లా పారిపోయారు. ఆ పార్టీ మొన్న అసెంబ్లీ నుంచి ఇప్పుడు పార్లమెంటు నుంచి పలాయనం చిత్త గించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ఉన్న కేసులను మాఫీ చేయించడం కోసం ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి జగన్‌కు బీజేపీకి మధ్య బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారు. ఆయన చంద్ర బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యా స్పదం. విజయసాయిరెడ్డి రిటైరయ్యాక థర్డ్‌ జం డర్‌ కింద దరఖాస్తు చేసుకుంటే పింఛను ఇస్తాం.అంటూ బోడే చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కూడా అదే రేంజ్‌లో స్పందించారు. మీరు త్వ‌ర‌లోనే ఇలాంటి పింఛ‌న్లు తీసుకునే రోజు వ‌స్తుంది.. అంటూ వ్యాఖ్య‌లు సంధించారు.

కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రధాని నరేంద్రమోదీని నిలువరించిన ఘనత టీడీపీది. ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఎక్కడున్నారు? రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందరం అండగా ఉండాలి.. అంటూ ఆర్టీసీ చైర్మ‌న్‌, ద‌ళిత నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఎంతో ఇచ్చామని కేంద్రప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మనమేమీ మోడీ తాత సొమ్ము ఇమ్మనడం లేదు. మనకు హక్కుగా రావాల్సిన నిధులనే అడుగుతున్నాం. పార్లమెంటు స్పీకర్‌ సుమిత్రా మ‌హాజ‌న్‌, ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌ నాథ్‌సింగ్‌లను వెనకేసుకురావడం సరికాదు అంటూ.. మ‌హిళా నేత‌, న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి ధ్వ‌జమెత్తారు.

రాష్ట్రానికి అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది. ఆంధ్రుల శాపం బీజేపీకి తగులుతుంది. వైసీపీ నాయకులు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ధర్మ పోరాటానికి ప్రజలంతా సంఘీభావం తెలపాలి.. అంటూ మ‌రో ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, వీరంతా అవిశ్వాస తీర్మానం వీగిపోయాక‌, చంద్ర‌బాబు బండారాన్ని ప్ర‌ధాని మోడీ బ‌య‌ట పెట్టాక మౌనంగా ఇంటి ముఖం ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. దీనిపై బోండా ఉమా.. మీడియాతో ఫోన్‌లో మాట్లాడ‌తూ.. “ఆలోచించి మాట్లాడ‌తామ‌ని“ చెప్ప‌డం విశేషం.

టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల బీభ‌త్సం.. ఏం జ‌రిగింద‌ని?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share