వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యే…ఓటమి భయంతో మరో జంప్!

September 21, 2018 at 11:41 am

గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీ ఓట్లతో గెలిచిన ఆయ‌న నోట్ల కోసం పార్టీ ఫిరాయించారు. అధికార టీడీపీలో చేరి ఏకంగా మంత్రి కూడా అయ్యారు. ఆయ‌న గారి తీరు, ప‌నితీరుపై ప్ర‌జ‌లు క్యాడ‌ర్ తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని.. ఇక ఏ మొహం పెట్టుకుని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడ‌గాల‌ని లోలోప‌ల తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం కూడా మార్చుకునేందుకు ఇప్ప‌టి నుంనే ప‌క్కా స్కెచ్ వేస్తున్నార‌ట‌.

ఇందులో సీఎం బాబుగారు కూడా సానుకూలంగా ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఇంత‌కీ ఎవ‌రా మంత్రి.. ఏమిటా నియోజ‌క‌వ‌ర్గం అని ఆలోచిస్తున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి అమ‌ర‌నాథ‌రెడ్డి.

dsc-0552-17-1466139433

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఆయ‌న పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత అధికార టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. కానీ.. వ్య‌వ‌హార శైలి, అభివ‌`ద్ధి ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డం.. ముఖ్యంగా వైసీపీ ఓట్ల‌తో గెలిచి టీడీపీలోకి వెళ్ల‌డంతో ప్ర‌జ‌లు మ‌స్తు కోపంతో ఉన్నారు. ఇక ఈ నాలుగేళ్ల‌లో ఆయ‌న చేసిన ప‌నులు కూడా ఏమీ లేక‌పోవ‌డంతో సొంత పార్టీ శ్రేణులు కూడా గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మంత్రిగారు మాంచి ప్లాన్ వేస్తున్న‌ట్లు స‌మాచారం.

అదేమిటంటే.. ఇక ప‌ల‌మ‌నేరులో గెలిచే అవ‌కాశాలు లేవు కాబ‌ట్టి నియోజ‌క‌వ‌ర్గం మారాల‌నే ఆలోచ‌న‌కు రావ‌డం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ఇప్ప‌టి నుంచి క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. ఎన్నిక‌ల నాటికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటున్నార‌ట‌.అయితే.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకుంటున్న తాజా నిర్ణ‌యాలు కూడా ఈ ప్ర‌చారానికి బ‌లాన్ని ఇస్తున్నాయి. పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రస్తుతం తెలుగుదేశానికి అమరనాథ‌రెడ్డి భార్య అనూషా రెడ్డిని పార్టీ ఇన్‌చార్జిగా చేయ‌డానికి బాబుగారు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పార్టీవ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆ నియోజ‌క‌వ‌ర్గం నేత‌లు లోలోప‌ల మండిప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

సాధార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జికే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో త‌ప్ప అభ్య‌ర్థిని మార్చే అవ‌కాశ‌మే ఉండ‌దు. ఈ ప‌ద‌విని ఇత‌ర నేత‌ల‌కు ఇస్తే.. తీరా ఎన్నిక‌ల వేళ‌.. నియోజ‌క‌వ‌ర్గం మార‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఆలోచ‌న‌తోనే త‌న భార్య‌కు ఇన్‌చార్జి ప‌ద‌వి ఇప్పించుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. అవ‌స‌రానికి ఎలా తీసుకోవాలో.. అది తీరాక ఎలా త‌ర‌మాలో బాగా తెలిసిన బాబుగారి చేతిలో మంత్రిగారు విల‌విలాడ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యే…ఓటమి భయంతో మరో జంప్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share