బాబుకు షాక్ …వైసీపీలోకి సీమ టీడీపీ ఎమ్మెల్యే!

July 11, 2018 at 12:22 pm
TDP, MLA, Meda Mallikarjuna reddy, wants to join in ysrcp, rajampeta

క‌డ‌ప జిల్లాలో టీడీపీకి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.. పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గుల‌బోతోంది.. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది.. ప‌లు విష‌యాల్లో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తానికి గుర‌య్యార‌నీ, అందుకే పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది. జిల్లాలోని ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క రాజంపేటలో మాత్ర‌మే టీడీపీ నుంచి బ‌రిలోకి దిగిన మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి విజ‌యం సాధించారు. అయితే.. ఆయ‌న‌ను ప్ర‌భుత్వ విప్‌గా చంద్ర‌బాబు నియ‌మించి.. ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన ఆది నారాయ‌ణ‌రెడ్డికి మాత్రం మంత్రిప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

ఇక్క‌డ మొద‌లైన విభేదాలు.. రోజురోజుకూ ఎక్కువ‌య్యాయ‌నే చెప్పొచ్చు. ఈ నాలుగేళ్లలో మేడా మ‌ల్లికార్జున‌రెడ్డిని ఇలా అనేక విష‌యాలు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెప్పుకుంటున్నారు. ఈ విష‌యంపై ప‌లుమార్లు ఆయ‌న బ‌హిరంగంగానే అసంత‌`ప్తిని వ్య‌క్తం చేశారు. నిజానికి వైఎస్సార్ కుటుంబంతో మేడాకు మంచి సంబంధాలు ఉన్నాయి.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు క‌లిసిరాక‌పోవ‌డంతో 2014ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. కానీ, పార్టీలో, ప్ర‌భుత్వంలో ఆయ‌న స‌ముచిత స్థానం ద‌క్క‌లేద‌న్న‌ది విస్ప‌ష్టం. వైసీపీని త‌ట్టుకుకుని గెలిచిన త‌న‌ను కాద‌నీ.. ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రిప‌ద‌వి ఇవ్వ‌డంపై మేడాతోపాటు ఆయన కుటుంబ స‌భ్యులు కూడా తీవ్ర అసంత‌`ప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఇక టీడీపీలో కొన‌సాగ‌ర‌నీ, వైసీపీలోకి వెళ్తార‌నే ప్ర‌చారం జోరందుకుంది.. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఆయ‌న‌ను పిలిచి మాట్లాడినా, ఆయ‌న తండ్రి రామ‌క‌`ష్ణారెడ్డికి టీటీడీ బోర్డు స‌భ్యుడిగా అవ‌కాశం ఇచ్చినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం.. తిరుప‌తి రింగు రోడ్డు నిర్మాణం కాంట్రాక్టు కూడా మేడాకు చెందిన సంస్థ‌నే చేస్తోంది. ఇక్క‌డ కూడా మేడా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌నుల్లో నాణ్యత లేద‌నే సాకుతో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్ అడ్డుకుంటున్నార‌ని మేడావ‌ర్గం ఆరోపిస్తోంది. ఈ విష‌యంలో మేడా మ‌ల్లికార్డున్‌రెడ్డి జోక్యం చేసుకున్నా ఫ‌లితం లేన‌ట్లు తెలుస్తోంది.

ఇలా ప‌లు విష‌యాల్లో మేడాకు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరితే మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్యే సీటు, ఆయ‌న సోద‌రుడు ర‌ఘునాథ‌రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ‌ వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌భుత్వంలో స‌ముచిత స్థానం ద‌క్కుతుంద‌ని కూడా జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

mallikarjuna-reddy-6725b45e-7385-48a8-ab37-e1f9ff870bc-resize-750

బాబుకు షాక్ …వైసీపీలోకి సీమ టీడీపీ ఎమ్మెల్యే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share