బాబుకు మ‌రో మ‌చ్చ‌.. భూ వివాదంలో కీల‌క‌ ఎంపీ

July 22, 2018 at 1:49 pm
TDP, MP, Thota narasimham, in land scam, Issue

ఏపీ అధికార పార్టీ నేత‌ల భూ వివాదాలు రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను సైతం దాటిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క ఎమ్మె ల్యేలు, మంత్రులు సైతం భూ క‌బ్జాలు, భూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దీంతో టీడీపీ ప్ర‌భ నానాటికీ మ‌స‌క‌బారు తోంది. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై ఇప్ప‌టి వ‌ర‌కు రెండు భూ క‌బ్జా, దౌర్జ‌న్యాల‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు వెలుగు చూశాయి. ఓ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుని కుటుంబానికి చెందిన 60 కోట్ల విలువ చేసే భూమిని ఈయ‌న స‌తీమ‌ణి ఆక్ర‌మించార‌ని, న‌కిలీ ప‌త్రాలు సృష్టించి కాజేశార‌ని అప్ప‌ట్లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇక‌, మ‌రో మ‌హిళ‌కు చెందిన భూమిని కూడా బోండా ఆక్ర‌మించార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇవి చంద్ర‌బాబు ప‌రిశీల‌నలో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

bondaumamaheswarrao11491200764

ఇక‌, కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. విశాఖ‌లో అసైన్డ్ భూముల‌ను కొల్ల‌గొట్టి త‌క్కువ‌కు కొనుగోలు చేసి ఇప్పుడు ఎక్కువ‌కు అమ్ముకుంటున్నార‌ని ఆయ‌న‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి మ‌రో ఎమ్మెల్యే కూడా సాయం చేస్తున్నార‌ని తెలియ‌డంతో సాక్షాత్తూ మ‌రో మంత్రి అయ్య‌న్న గంటాపై విరుచుకుప‌డ్డారు. ఈ ప‌రిణామాల‌తో తాజాగా గంటాపై సిట్‌కూడా ఏర్పాటై.. ద‌ర్యాప్తు చేస్తోంది. ఇదిలావుంటే, తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహంపైనా భూక‌బ్జా ఆరోప‌ణ‌లు తార‌స్థాయికి చేరుకున్నాయి.

dc-Cover-9h95uc3et3s6kv7r3cmi8ehrj3-20160806072308.Medi

పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం కుటుంబం ఓ భూవివాదంలో ఇరుక్కుంది. 284 ఎకరాల ఎంఎస్‌ఎన్‌ చారిటీ భూములను.. ఎకరాకు కేవలం రూ. 16 చెల్లిస్తూ అనుభవిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీ భూముల పరిరక్షణ సమితి ఏర్పాటైంది. ఈ సందర్భంగా పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ… విద్యార్థులకోసం నాయకర్‌ భూములను దానం చేస్తే శాశ్వతంగా ఆక్రమించుకోవాలని ఎంపీ తోట నరసింహం కుటుంబం చూస్తోందని ఆరోపించారు.

Thota narasimham

ఎంఎస్‌ఎన్‌ స్కూల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని, ఈ వ్యవహారంపై 45 రోజుల్లో ఏపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ఎంఎస్‌ఎన్‌ చారిటీ భూముల అన్యాక్రాంతం గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానని, భూముల పరిరక్షణ కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కుంభ‌కోణం.. మ‌రింత‌గా ముదిరే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి

బాబుకు మ‌రో మ‌చ్చ‌.. భూ వివాదంలో కీల‌క‌ ఎంపీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share