తెలంగాణ వ‌ద్దు.. బాబు డిసైడ్‌.. రీజ‌న్లు ఇవే..!

September 14, 2018 at 5:56 pm
TDP, Telangana, Chandra babu, left, Reasons

ముందస్తు ముచ్చ‌ట‌కు తెలంగాణాలో తెర‌లేచింది. ఈ ఏడాదిలోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం, లెక్కింపు పూర్త‌వ‌డం, గెలుపొంది న పార్టీని ప్ర‌క‌టించ‌డం, ప్ర‌భుత్వ ఏర్పాటు వంటి కీల‌క అంశాల‌న్నీ కూడా పూర్తి కానున్నాయ‌నే వార్త‌లు తాజాగా వినిపిస్తూ నే ఉన్నాయి. ప‌క్కా వ్యూహంతోనే ప్ర‌స్తుత ఆప‌ద్ధ‌ర్మ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఈ ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు. క‌ట్ చేస్తే.. ఈ ఎన్నిక‌ల‌ను తెలంగాణలోని అన్ని పార్టీలూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. మ‌రి త‌మ‌ది జాతీయ పార్టీ అని, తమకు తెలంగాణాలో నూ ఓటు బ్యాంకు ఉంద‌ని చెప్పుకొనే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏమేర‌కు తెలంగాణా లో పోటీ చేస్తారు? అధికార టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని ఎలా ఎదుర్కొంటారు? అనేవి కీల‌కంగా మారాయి.

L-Ramana

నిన్న మొన్న‌టి వ‌రకు కూడా దీనిపై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. చంద్ర‌బాబు తెలంగాణ‌లోనూ చ‌క్రం తిప్పుతార‌ని, ఆయ‌న ప్ర‌భావం భారీ ఎత్తున క‌న‌బ‌డుతుంద‌ని బాబు అనుకూల మీడియాలో క‌థ‌నాలు ఊద‌ర‌గొట్టాయి. అయితే, ఇవ‌న్నీ ఒట్టి డొల్లేన‌ని తాజాగా స్ప‌ష్ట‌మైంది! తాను తెలంగాణ విష‌యంలో నిమిత్తం మాత్రుడ‌నేన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. తాను ఏమీ చేయ‌లేన‌ని, పార్టీని మీరే కాపాడుకోవాల‌ని ఆయ‌న స్థానిక నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. తాను ప్ర‌చారానికి కూ డా రాబోన‌ని చేతులు ఎత్తేశారు. ఇక‌, అత్యంత విలువైన పొత్తుల విష‌యంలోనూ ఆయ‌న బంతిని త‌న కోర్టులో లేకుండా చే శారు. పొత్తుల విష‌యాన్ని కూడా పార్టీ నేత‌ల‌కే ఆయ‌న వ‌దిలి పెట్టారు.

నిజానికి ఈ ప‌రిణామాన్ని తెలంగాణ నాయ‌కులు ఏ ఒక్క‌రూ కూడా ఊహించ‌లేదు. త‌మ‌కు దిశానిర్దేశం చేయ‌డానికి చం ద్రబాబు హైద‌రాబాద్ వ‌చ్చార‌ని అనుకున్నారే కానీ, ఇలా అస్త్ర స‌న్యాసం చేస్తార‌ని, బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొంటార‌ని వా రు ఊహించ‌లేదు. దీంతో బాబు వ్యూహంతోనే ఇలా ఈ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొన్నారా? లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా? అనే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వీటిని త‌ర‌చి చూస్తే.. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగానే తెలంగాణ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొన్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో టీడీపీకి పొత్తు అనివార్యం. ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్ కొట్టుకు పోయింది. నాయ‌కులు చెల్లా చెదుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఉనికిని చాటే ప‌రిస్థితి కూడా లేదు.

d43613c9216eeadc810201e3ba29f489

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌కు టీడీపీ, టీడీపీకి కాంగ్రెస్ కూడా చాలా అవ‌స‌రం. అయితే, మ‌రోప‌క్క ఏపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబుకు అక్క‌డ అనేక అగ్ని ప‌రీక్ష‌లు ఉన్నాయి. తెలంగాణ‌లో ఎన్నిస్థానాల్లో పోటీ చేసినా.. అధికారం ద‌క్క‌డం క‌ల. కానీ, ఏపీలో మాత్రం జగన్ పోటీని తీవ్రంగా ఎదురుకోవాలి . ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ఏవైనా పొర‌పాట్లు చేస్తే.. త‌న‌కు అంటుకుని తీర‌డం ఖాయ‌మ‌ని భావించిన బాబు నైస్‌గా పొత్తుల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌చారం వ‌ర‌కు కూడా త‌ప్పుకొన్నారు. కేసీఆర్, కేటీఆర్ వాడి వేడి విమ‌ర్శ‌ల నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డంతోపాటు కొన్ని కేసుల విష‌యంలోనూ బాబు భ‌య‌ప‌డ్డార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగానే తెలంగాణ‌లో చేతులు ఎత్తేశార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

తెలంగాణ వ‌ద్దు.. బాబు డిసైడ్‌.. రీజ‌న్లు ఇవే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share