టీడీపీ అనాథలా ఎందుకు మారిందంటే?

October 23, 2018 at 3:33 pm

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆల్మోస్ట్ అనాథ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆ పార్టీ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పార్టీ మంచిచెడులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడంటే ఎన్నికలు ముంచుకువచ్చేశాయి గనుక.. గత రెండు నెలల్లో రెండు సార్లు పార్టీ నాయకులతో సమావేశం అయిన చంద్రబాబు.. అంతకుముందు పార్టీ మీద అపరిమితమైన నిర్లక్ష్యాన్నే ప్రదర్శించారు. అయితే ఇదంతా ఎందుకు? తెలుగుదేశం పార్టీ అనే దానికి వైభవ స్థానం దక్కడానికి తెలంగాణ ఓటర్లు కూడా కీలకంగానే సహకరించారు కదా! మరి ఇప్పుడాయన తెతెదేపా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు దానిని అనాథలా వదిలేశారు? అనే అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి.

దానికి సమాధానం చంద్రబాబే చెప్పుకున్నారు. ‘ఇక్కడేమైనా నేను సీఎం అవుతానా’ అన్న చంద్రబాబు మాటలే ఆయన విముఖతకు కారణం అని అనుకోవాల్సి వస్తోంది.

TTDP_4766

ఇక్కడ మరో సంగతిని కూడా గమనించాలి. కేసీఆర్ నన్ను దూషించడాన్ని ప్రజలే హర్షించడం లేదు అని కూడా చంద్రబాబునాయుడు అంటున్నారు. ‘ప్రజలు హర్షించడం లేదు’ అనే మాట పాక్షిక సత్యం మాత్రమే.. అలాంటి ప్రజలు కేసీఆర్ మాట్లాడుతున్న తీరునే ఆక్షేపిస్తున్నారు. అంతే తప్ప.. ఆ తిట్లకు గురవుతున్నది చంద్రబాబా? మరొకరా? అనేది పట్టించుకోవడం లేదు. తిడుతున్న తీరే వారికి అభ్యంతరకరం. అంతే తప్ప.. కేసీఆర్ దూషణల్ని ఇష్టపడని ప్రజలందరూ తన భక్తులే అని చంద్రబాబునాయుడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అలాంటి మాటల ద్వారా సానుభూతి పొందవచ్చునని భావిస్తే కూడా పప్పులో కాలేసినట్లే.

కేసీఆర్ తిట్ల వలన చంద్రబాబునాయుడు పట్ల సానుభూతిని పెంచాలని పచ్చ కోటరీ మొత్తం విచ్చలవిడిగా ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజలు మరీ అంత అమాయకంగా ఏమీ లేరు. చంద్రబాబు ఏం చెబితే అది నమ్ముతారని అనుకోవడం భ్రమ. తెలంగాణ రాజకీయాలు వ్యక్తిగతంగా తనకు ఉపయోగ పడేది లేదు గనుక.. పార్టీని కూడా గాలికొదిలేసిన చంద్రబాబుకు వాస్తవంగా అసలు ప్రజల మీద శ్రద్ధ ఉందా? ఉంటే గనుక, తెలంగాణ ప్రజల గురించి ఆయన శ్రద్ధగా పట్టించుకోకుండా ఉంటారా? అనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ అనాథలా ఎందుకు మారిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share