టీడీపీలో నేత‌ల మారాం.. రీజ‌న్ తెలిస్తే.. షాకే!

August 19, 2018 at 10:59 am

ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎన్న‌డూ లేని కొత్త సంప్ర‌దాయం వెలుగులోకి వ‌స్తోంది. దివంగ‌త ఎన్టీఆర్ హ‌యాంలో కూడా వెలుగు చూడ‌ని ఓ విష‌యం ఇప్పుడు టీడీపీలో క‌నిపిస్తోంది. ఎన్నిక‌లకు స‌మ‌యం చేరువ అవుతున్న కొద్దీ పార్టీలో స్త‌బ్దుగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు తాచు పాముల్లాగా బుస‌లు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా అధినేత చంద్ర బాబుకే అల్టిమేటం జారీ చేస్తున్నారు. మా మాట విన‌క‌పోతే.. అంటూ.. అధినేత‌ను బెదిరించే ప్ర‌య‌త్నం కూడా చేస్తు న్నారు. నిజానికి ఇలాంటి ప‌రిణామం ఇంత‌కు ముందు కూడా లేదు. కానీ, కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చిన సంప్ర‌దాయం.. అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరేడు మాసాల గ‌డువే ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

09-1452330466-chandrababunaidu

మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నేది ఆయ‌న వ్యూహం. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మా? అనే వ‌ర‌కు కూడా ఆయ‌న వెళ్లారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించారు. దీంతో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న విశ్వ‌సించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల మూలంగా పార్టీ గెలుస్తుందో లేదో చెప్ప‌లేము కానీ, వైసీపీ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో టికెట్‌లు ఆశిస్తున్న టీడీపీ నేత‌ల నుంచి మాత్రం తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌స్తోంది. గత ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌ల చేతిలో ఘోరంగా ఓడిపోయి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా గెలిచి త‌మ స‌త్తా చాటాల‌ని భావిస్తున్న తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ఇప్పుడు అవ‌స‌ర‌మైతే.. అధినేతపై యుద్ధానికి సైతం దిగుతున్నారు.

ఈ వ‌రుస‌లో వారు వీరు అని చెప్ప‌డానికి ఏమీ లేదు టికెట్ రాజ‌కీయాలు ముసురుకున్న నేప‌థ్యంలో త‌మ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.,. పార్టీ ఎలా బ‌తికి బ‌ట్ట‌క‌డుతుందో చూస్తామంటూ.. తెర‌చాటుగా కొంద‌రు నేత‌లు చేస్తున్న హెచ్చ‌రిక‌లు ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు చేరిపోయాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో వారికే తిరిగి టికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, ఈ టికెట్‌ను ఆశిస్తున్న టీడీపీనాయ‌కులు మాత్రం వారిని పార్టీలోకి చేర్చుకుని బాగానే ముట్ట‌జెప్పారు, కాంట్రాక్టులు, నిధులు బాగానే ఇచ్చారు. కాబ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం టికెట్ ను మాకే ఇవ్వాలి! అని ష‌ర‌తు పెడుతున్నారు ఒక వేళ అలా కాని ప‌క్షంలో ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేందుకు కూడా తాము వెరిచేది లేద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ ప‌రిణామం గ‌త టీడీపీలో లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని ఛేదించుకుని చంద్ర‌బాబు ముందుకు వెళ్తారో మునుగుతారో చూడాలి.

టీడీపీలో నేత‌ల మారాం.. రీజ‌న్ తెలిస్తే.. షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share