మోడీ తీరుతో తెలంగాణ‌లో క‌మ‌లం గగ్గోలు

September 6, 2018 at 10:52 am

మోడీ తీరుతో తెలంగాణ‌లో క‌మ‌లం వాడిపోతోందా..? ఆయ‌న వ్య‌వ‌హారంతో పార్టీ త‌న ఆహార్యం కోల్పోతుందా..? జ‌న చైత‌న్య‌యాత్ర‌తో జోరందుకున్న రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని చేజేతులా దెబ్బ‌కొడుతున్నారా..? అంటే తెలంగాణ బీజేపీ వ‌ర్గాలు లోలోప‌ల ఔన‌నే అంటున్నాయి. ముంద‌స్తు ఎన్నిల‌కు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇదేస్థాయిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌తోపాటు తెలంగాణ‌లో అడ్ర‌స్ లేకుండా పోయింద‌నుకున్న టీడీపీ కూడా ముంద‌స్తు పోరుకు రంకెలు వేస్తోంది. కానీ.. క‌మ‌ల‌ద‌ళం మాత్రం అయోమ‌యంలో ప‌డిపోయింది. ఏం చేయాలో తెలియ‌క ఆగ‌మాగం అవుతోంది. నిజానికి రాష్ట్రంలో పార్టీ ఈ ద‌యనీయ ప‌రిస్థితిని ఎదుర్కొన‌డానికి ప్ర‌ధాని మోడీయే కార‌ణ‌మ‌నే భావ‌న పార్టీవ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. ఇక్క‌డ రాష్ట్ర నాయ‌క‌త్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతుంటే.. సీఎం కేసీఆర్ అడిగిన‌ప్పుడ‌ల్లా మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం.. ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉండ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ‌లో పార్టీపై త‌ప్పుడు సంకేతాలు వెళ్తున్నాయ‌నీ… బీజేపీ, టీఆర్ఎస్ ఒక్క‌టేన‌న్న భావన ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతోందని, ఇది పార్టీని తీవ్ర న‌ష్టం చేస్తోంద‌ని ప‌లువురు నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దేశంలో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ.. ప్ర‌ధాని మోడీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగించడం మంచిది కాద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇలా మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో రాష్ట్ర నాయ‌క‌త్వం పూర్తిగా డీలా ప‌డిపోయిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌చైత‌న్య‌యాత్ర‌తో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించి, సాధించిన సానుభూతిని ప్ర‌ధాని మోడీ బూడిద‌లో పోసిన‌ప‌న్నీరులా మార్చార‌నీ.. ఇలా అయితే ఇక పార్టీ కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌నే ఆవేద‌న పార్టీవ‌ర్గాల్లో వినిపిస్తోంది.

modi_kcr11501126999

ఒక‌వేళ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రిస్తే.. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రిస్తాన‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా.. ఆయ‌న మాట‌మీద నిల‌బ‌డే ర‌కం కాద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. తెలంగాణ ఇవ్వ‌కముందు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఆ త‌ర్వాత ఏం చేశాడో అంద‌రికీ తెలిసిందేన‌నీ.. తెలంగాణ వ‌స్తే మొద‌టి ముఖ్య‌మంత్రిని ద‌ళితుడినే చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఆ త‌ర్వాత ఏం చేశారో తెలంగాణ ప్ర‌జానీకానికి తెలుసున‌నీ.. ఇలాంటి నేత వ‌చ్చే లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో పార్టీకి స‌హ‌క‌రిస్తానంటే ఎలా న‌మ్ముతారంటూ ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఐదు స్థానాల్లో విజ‌యం సాధించింది బీజేపీ. ఇప్పుడున్న తాజా ప‌రిస్థితుల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగక‌త‌ప్ప‌దు. అంతేగాకుండా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేశార‌న్న కోసంతో సెటిల‌ర్లు కూడా దూర‌మ‌య్యారు.

ఇలా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వ్య‌వ‌హార శైలితో పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌నే వాద‌న పార్టీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. మ‌రో విష‌యం ఏమిటంటే.. ఈ ఎన్నిక‌ల్లో ఐదు సిట్టింగ్ స్థానాల‌ను కాపాడుకోవ‌డం అంత సులువు కాద‌నే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉండ‌గా… ఈనెల 8, 9వ తేదీల్లో రాష్ట్ర నాయ‌క‌త్వంతో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా భేటీ కాబోతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే.. అనుస‌రించాల్సిన వ్యూహంపై ఆయ‌న దిశానిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.. అయితే.. పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయిన క‌మ‌ల‌ద‌ళానికి అమిత్‌షా ఏ మేర‌కు బూస్ట్ అందిస్తారో చూడాలి మ‌రి.

KCR-Narendra-Modi

మోడీ తీరుతో తెలంగాణ‌లో క‌మ‌లం గగ్గోలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share