టీ కాంగ్రెస్ పార్టీ తొలిజాబితా..రిలీజ్!

September 29, 2018 at 11:34 am
555555555555555

తెలంగాణలో ఎన్నికల జోరు బాగా పెరిగిపోయింది. తెలంగాణ అసెబ్లీ రద్దు అయినప్పటి నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మద్య వాడీ వేడి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ అధ్యక్షులు..అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105 మంది ఎమ్మెల్యేల లీస్టు రిలీజ్ చేశారు. అయితే వీటి పై అసమ్మతి వాదులు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికలో టీఆర్ఎస్ ని బొంద పెడతాం..గద్దె దించుతాం అంటూ పంతం పట్టిన కాంగ్రెస్ పొత్తుల దిశంగా అడుగులు వేస్తుంది.Hyderabad: Telangana Congress chief N. Uttam Kumar Reddy addresses a press conference in Hyderabad on Oct 10, 2015. (Photo: IANS)

ఈ నేపథ్యంలో మహాకూటమికి ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంది. ఇప్పటికే టీడీపీ,కోదండరామ్, కమ్యూనిస్టు పార్టీతో జతకట్టాలని చూస్తున్నారు. కాకపోతే సీట్ల సర్ధుబాటులు ఎక్కడా పొంతన కుదర చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌తో బుధవారం ఖుంటియా, ఉత్తమ్‌ సమావేశమై పొత్తులు, అభ్యర్థుల ఎంపికతోపాటు పలు అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన కొండా దంపతులు రెండు సీట్లు కావాలని డిమాండ్‌ చేసినా.. ఒక సీటు ఇచ్చినా ఓకే అని చెప్పినట్లు సమాచారం.

అయితే, వరంగల్‌తూర్పు కాకుండా పరకాల సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన నేపథ్యంలో సందిగ్ధత ఏర్పడింది. దీంతో టీడీపీకి వరంగల్‌పశ్చిమ ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపుగుర్రాల తొలి జాబితాను రెడీ చేసుకుంది. స్పష్టత ఉన్న స్థానాలపై మొదట దృష్టి పెట్టిన టీపీసీసీ 32 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రేపోమాపో అధిష్ఠానంతో ఆమోద ముద్రవేయించి తొలిజాబితాను అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా :
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌)
జానారెడ్డి (నాగార్జునసాగర్‌)
దామోదర్‌ రాజనర్సింహ (ఆంథోల్‌)
సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్‌)
గీతారెడ్డి (జహీరాబాద్‌)
జగ్గారెడ్డి (సంగారెడ్డి)
ప్రతాపరెడ్డి (గజ్వేల్‌)
కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ)
ఆర్‌.దామోదర్‌రెడ్డి (సూర్యాపేట)
పద్మావతి (కోదాడ)
బిక్షమయ్యగౌడ్‌ (ఆలేరు)
సుదర్శన్‌రెడ్డి (బోధన్‌)
షబ్బీర్‌అలీ (కామారెడ్డి)
అనిల్‌ (బాల్కొండ)
పొన్నాల లక్ష్మయ్య (జనగాం)
దొంతిమాధవరెడ్డి (నర్సంపేట)
గండ్ర వెంకట్రమణారెడ్డి (భూపాలపల్లి)
డి.కె.అరుణ (గద్వాల)
రేవంత్‌రెడ్డి (కొడంగల్‌)
మర్రి శశిధర్‌రెడ్డి (సనత్‌నగర్‌)
టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల)
శ్రీధర్‌బాబు (మంథని)
ఎ.లక్ష్మణకుమార్‌ (ధర్మపురి)
ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు)
మల్లు భట్టివిక్రమార్క (మధిర)
రేగా కాంతారావు (పినపాక)
జి.చిన్నారెడ్డి (వనపర్తి)
ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ (అలంపూర్‌)
వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి)
టి.రామ్మోహన్‌రెడ్డి (పరిగి)
సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)
ప్రతాపరెడ్డి (షాద్‌నగర్‌).

టీ కాంగ్రెస్ పార్టీ తొలిజాబితా..రిలీజ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share