తెలంగాణ‌లో బాబు బ‌లం ఇదేన‌ట‌!

November 1, 2018 at 12:05 pm

బాబోయ్‌.. బాబు..! ఆయ‌న తీరే వేరు.. లెక్క‌ల్లో తుక్కు లెక్క‌లు వేర‌యా.. విశ్వ‌దాభి రామ బాబు మ‌హిమ‌..! అని ప‌ద్యం పాడుకోవాలి మ‌నమిప్పుడు. బాబుగారికి నచ్చిన‌ట్టుగా వార్తా క‌థ‌నాలు వండ‌డం.. స‌మయానికి త‌గ్గట్టుగా వాటిని వ‌డ్డించ‌డం.. ఆయ‌న అనుకూల మీడియా ప‌ని. ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ను చంద్ర‌బాబు క‌లుస్తున్న సంద‌ర్భంలో.. ఇప్పుడు ఆ మీడియా వేసిన క‌థ‌నం ఒక‌టి అంద‌రినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇంత‌కీ ఆ క‌థ‌నం ఏమిటి..? బాబు మ‌హిమ ఏమిటి..? అనే క‌దా మీ డౌటు..! ఇక్క సూటిగా అక్క‌డికే వ‌ద్దాం.. ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

States-Oct1-5

అయితే.. మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అన్ని పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ టీడీపీ 15సీట్లు, తెలంగాణ జ‌న స‌మితికి 6సీట్లు, సీపీఐకి 3సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇక్క‌డే బాబు, అనుకూల మీడియా మ‌హిమ చూపించారు. తెలంగాణ‌లో జ‌రిగిన ఓ స‌ర్వేలో టీడీపీ సుమారు 35సీట్ల‌లో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని, పార్టీ బ‌లంగా ఉంద‌ని తేలిన‌ట్లు వార్తా క‌థనం ప్ర‌చురించింది. ఈ మేర‌కు జాబితా కూడా చూపించింది. అయితే.. ఈ స్థానాల్లో పార్టీ బ‌లంగా ఉంద‌ని, ఇక్క‌డ ఎవ‌రిని నిల‌బెట్టినా గెలుపు ఖాయంగా క‌నిపిస్తోందని ఆ స‌ర్వేలో తేలిన‌ట్లు చెప్పుకొచ్చింది.

ఒక‌వేళ టీడీపీ బ‌లంగా ఉంటే.. కేవ‌లం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 15సీట్ల‌కు ఎందుకు త‌లూపింద‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇదంతా కూడా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్‌తో భేటీ అవుతున్న సంద‌ర్భంగా వండివార్చిన క‌థ‌నంగా ప‌లువురు భావిస్తున్నారు. అయితే.. ఈ జాబితాను కూడా రాహుల్‌కు అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా బాబు త‌న‌దైన శైలిలో మైండ్‌గేమ్‌కు తెర‌లేపిన‌ట్లుగా ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక్క‌డ కొస మెరుపు ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌తంగా చేయించిన స‌ర్వేలో టీడీపీ బ‌లం బ‌య‌ట‌ప‌డింద‌ట‌.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ కంటే.. టీడీపీనే ఎక్కువ బ‌లంగా ఉన్న‌ట్లు చెప్ప‌డ‌మే ఆ క‌థ‌నంగా సారాంశంగా క‌నిపిస్తోంది.

టీడీపీ బ‌లంగా ఉన్న స్థానాలు ఇవేన‌ట‌..
+ దేవరకద్ర,

+ మక్తల్,

+ వనపర్తి,

+ జడ్చర్ల

+ షాద్ నగర్

+ పటాన్ చెరు

+ జహీరాబాద్

+ నిజామాబాద్ రూరల్

+ బోధన్

+ ఆర్మూర్

+ సిర్పూర్

+ ఖానాపూర్

+ జగిత్యాల

+ పెద్దపల్లి

+ నర్సంపేట్

+ ములుగు

+ వరంగల్ తూర్పు

+ భూపాలపల్లి

+ ఖమ్మం

+ కొత్తగూడెం

+ సత్తుపల్లి

+ మిర్యాలగూడ

+ హుజూర్ నగర్

+ తుంగతుర్తి

+ ఆలేరు

+ ఉప్పల్

+ ఎల్ బీ నగర్

+ రాజేంద్రనగర్

+ శేరిలింగంపల్లి

+ కూకట్ పల్లి

+ కుత్బుల్లాపూర్

+ ముషీరాబాద్

+ సనత్ నగర్

+ ఖైరతాబాద్

+ జూబ్లీహిల్స్

తెలంగాణ‌లో బాబు బ‌లం ఇదేన‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share