తెలంగాణ టీడీపీలో మ‌రో వికెట్ ఫ‌ట్.. వంటేరు జంప్‌

February 22, 2018 at 3:27 pm
telangana, TDP, vanteru pratap reddy, jump, congress

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆశ‌లు అడియాశ‌లు అవుతున్నాయా?   ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌తో అటు తెలంగాణ‌, ఇటు ఏపీల్లోనూ ఆయ‌న పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌ని భావించినా.. అవి సాధ్యం కావ‌డం లేదా?  ఇక, టీడీపీ తెలంగాణ‌లో ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అనే ప‌రిస్థితికి చేరుకుందా? అంటే తాజాగా ప‌డిపోయిన మ‌రో వికెట్ ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న‌తో టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు.  పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా త‌న‌ను, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌న కుమారుడు నారా లోకేష్‌ను ఆయ‌న ప్ర‌మోట్ చేసుకున్నారు. అంతేకాదు, ఆఫ్‌ది రికార్డుగా తెలంగాణ‌కు నారా లోకేష్‌ను సీఎం అభ్య‌ర్థిగా కూడా ప్ర‌క‌టించేలా తెర వెనుక మంత్రాంగం కూడా చేశారు. కాలం క‌లిసొచ్చి 2019లో తెలంగాణ‌లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. లోకేష్‌ను సీఎం చేయాల‌నేది రెండేళ్ల కింద‌ట చంద్ర‌బాబు వేసుకున్న ప్లాన్‌గా టీడీపీ నేత‌లు ఇప్ప‌టికీ చెప్పుకొంటారు. 

vanteru-pratap

అయితే, అనూహ్యంగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ దెబ్బ‌కి టీడీపీ కుదేలైంది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి రావ‌డంతో టీడీపీ స‌మూలంగా ప‌ట్టుత‌ప్పింది. అప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో విజ‌యం కోసం నానాతిప్ప‌లు ప‌డ్డ చంద్ర‌బాబు ఇప్పుడు తెలంగాణ వెళ్లేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన కుటుంబ వేడుక‌కు కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న చిత్తూరులోని త‌న సొంత నివాసానికి పిలిపించుకుని కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ దిక్కూ మొక్కూలేని పార్టీగా త‌యారైంది. ఇక‌, నేటి రాజ‌కీయా ల్లో అధికారం లేక‌పోతే.. నేత‌ల ప‌రిస్థితి బిళ్ల బంట్రోతు క‌న్నా హీనంగా ఉన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో టీడీపీ తెలంగాణ నేత‌లు ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. కీల‌క‌మైన నేత‌లు 2014లో టీడీపీ త‌ర‌ఫున తెలంగాణ గెలిచి అనంతరం కేసీఆర్ పంచ‌న చేరిపోయి ప‌దవులు సంపాయించుకున్నారు. 

 

మంత్ర‌లు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌హేంద‌ర్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ఈ కోవ‌లోకే వ‌స్తారు. వారిని నిలువ‌రించేందుకు పార్టీ మార‌కుండా ప్ర‌య‌త్నించేందుకు చంద్ర‌బాబు చ‌క్రం తిప్పినా అప్ప‌ట్లో సాధ్యం కాలేదు. ఇక‌, ఓటుకు నోటు కేసు వెలుగు చూశాక‌.. చంద్ర‌బాబు తెలంగాణ‌లో పార్టీ విష‌యాల‌ను లైట్‌గా తీసుకోవ‌డం ప్రారంభించారు. దీంతో మిగిలిన వారిలో చాలా మంది కూడా కుదిరితే టీఆర్ ఎస్ లేక‌పోతే.. కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. దీంతో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఇప్ప‌టికీ ఊగిస‌లాడుతున్న వారి జాబితాలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా టీడీపీకి అండ‌గా ఉంటార‌ని భావించిన వంటేరు ప్ర‌తాప‌రెడ్డి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ముహూర్త‌మే త‌రువాయి అన్న‌ట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న నేరుగా కాంగ్రెస్ నేత‌ల‌తో ఒప్పందం చేసుకున్నార‌ని స‌మాచారం. 

 

గజ్వేల్‌కు చెందిన టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా వంటేరు చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా టీడీపీ పుంజుకునే అవ‌కాశం లేద‌ని స్పష్టంగా తెలియ‌డంతో ఆయ‌న త‌న దారి తాను చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వచ్చేనెలలో కాంగ్రెస్‌లో చేరేందుకు భూమిక సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఆయన గజ్వేల్‌ నుంచి సీఎం కేసీఆర్‌కు గట్టిపోటీ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయనకు రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది. దీంతో, గజ్వేల్‌లో గట్టి నాయకుడి కోసం ఆన్వేషించిన కాంగ్రెస్‌ పార్టీ వంటేరుపై దృష్టి సారించింది. ఆయ‌న కూడా టీడీపీ వ‌ల్ల లాభం లేద‌ని భావించి కాంగ్రెస్‌లోకి జంప్ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో గ‌జ్వేల్‌లో టీడీపీ క‌థ స‌మాప్తం.. అనే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

తెలంగాణ టీడీపీలో మ‌రో వికెట్ ఫ‌ట్.. వంటేరు జంప్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share