ఖ‌మ్మంలో వెనుక‌బ‌డ్డ తుమ్మ‌ల‌.. ఏంజ‌రిగిందంటే..!

October 20, 2018 at 4:45 pm

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. ప్ర‌స్తుతం తెలంగాణా ప్ర‌భుత్వ పార్టీ టీఆర్ ఎస్‌లో కీల‌క నాయ‌కుడు. ఏపీ స‌రిహ‌ద్దు జిల్లా అయిన ఖ‌మ్మం నుంచి చ‌క్రం తిప్పుతున్న నాయ‌కుడు. ఆదిలో టీడీపీలో ఉన్న ఆయ‌న ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు చాలా ద‌గ్గ‌ర‌గా మెలిగిన నాయ‌కుడు. అత్యంత స‌న్నిహితుడుగా ఉన్న నాయ‌కుడు కూడా అయితే, ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో తుమ్మ‌ల టీఆర్ ఎస్‌లో చేర‌డం, మంత్రి ప‌ద‌విని కూడా సాధించ‌డం తెలిసిందే. అప్ప‌టి నుంచి కూడా టీఆర్ ఎస్ అధినేత.. కేసీఆర్‌కు న‌మ్మిన బంటు మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ ఆయ‌న‌కు ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను అప్ప‌గించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌మ్మంలో విజ‌యం సాధించే బాధ్య‌త‌ను కేసీఆర్ తుమ్మ‌ల చేతిలోనే ఉంచారు.

064057DSC_5610-1024x681

ఈ ప‌రిణామంతో తుమ్మ‌ల గ్రాఫ్ మ‌రింత‌గా పెరుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనుకున్నంత‌గా తుమ్మ ల గ్రాఫ్ పెర‌గ‌క‌పోగా.. ఇప్పుడు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చాలా చోట్ల టికెట్ల విష‌యంలో అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయ‌ని, ముఖ్యంగా ఏపీ స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ వివాదాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. దీంతో ఎన్నిక‌ల విష‌యంలో నాయ‌కులు ఒక దారి ప్ర‌జ‌ల‌ది మ‌రోదారి అన్న విధంగా సాగు తోంద‌ని అంటున్నారు. నిజానికి అటు మీడియాలోను, ఇటు ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల్లోనూ తుమ్మ‌ల‌కు మ‌ద్దతు బాగానే ఉంది. అయి తే, పార్టీ తీసుకున్న యూట‌ర్న్ కార‌ణంగా ప్ర‌ధానంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న వ్య‌తిరేక‌త మొత్తం.. ఇప్పుడు తుమ్మ‌ల‌పై ఎఫెక్ట్ చూపిస్తోంద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల ఇక్క‌డ కీల‌క‌మైన నాలుగు నియోజ‌క‌వర్గాల ప‌రిధిలో టీడీపీ నాయ‌కుడు, సినీ హీరో, ఎమ్మెల్యే బాల‌య్య.. ఇక్క‌డి టీడీపీ నేత‌ల విజ్ఞ‌ప్తి మేర‌కు ప‌ర్య‌టించి ప్ర‌చారం చేశారు. నామా నాగేశ్వ‌ర‌రావుకు సంబంధించి ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే, కేసీఆర్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా.. ఖ‌మ్మం.. అభివృద్ధిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. అదేవిధంగా టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని కూడా ఆయ‌న ఏక‌రువు పెట్టారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో ఇప్పుడు టీఆర్ ఎస్ ప్ర‌బుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్లిందో చెప్ప‌లేని ప‌రిస్తితిలో ఉంద‌ని బాల‌య్య చేసిన ఘాటు విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో నే తుమ్మ‌ల‌కు మ‌రింత బాధ్య‌త పెరిగింద‌ని అంటున్నారు. అయితే, ఆయ‌న ఏమేర‌కు కేసీఆర్‌కు ల‌బ్ధి చేకూర్చి పెడ‌తారు? అనేది ఇప్పుడు అనేక ప్ర‌శ్న‌ల‌కు అవ‌కాశం ఇస్తున్న విష‌యం. చూడాలి.. తుమ్మ‌ల ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డ‌తారో?

ఖ‌మ్మంలో వెనుక‌బ‌డ్డ తుమ్మ‌ల‌.. ఏంజ‌రిగిందంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share