పవన్ ఇష్యూ …. బాలయ్య రాజకీయం

April 25, 2018 at 5:33 pm
tollywood industry, pawan kalyan issue, balakrishna, not attend

ఆరునెల‌లు తిరిగితే చాలు రాజ‌కీయాలు ఎంత‌బాగా అబ్బుతాయో తెలిసిపోతుంది! అంటారు ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌లు. ఇప్పుడు ఇలాంటి రాజ‌కీయాలే బాగా చేస్తున్నారు నంద‌మూరి బాల‌య్య‌. హిందూపురం ఎమ్మెల్యే అయిన ఆయ‌న మొద‌ట్లో పెద్దగా రాజ‌కీయాల గురించి మాట్లాడ‌లేదు. అయితే, 2014లో హిందూపురం నుంచి రంగంలోకి దిగిన త‌ర్వాత మాత్రం చంద్ర‌బాబు సాహ‌చ‌ర్య‌లో బాల‌కృష్ణ పెద్ద ఎత్తున రాజ‌కీయాలు నేర్చేసుకున్నారు. ఆ రాజ‌కీయాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటూ అవ‌స‌ర‌మైన మేర‌కు వాడుకుంటున్నాడు. తాజాగా ఏపీలో టాలీవుడ్‌కి-అధికార టీడీపీకి మ‌ధ్య పెద్ద ఎత్తున అగాథం ఏర్ప‌డింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇండ‌స్ట్రీ పోరాడ‌దా ? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇండ‌స్ట్రీని క‌డిగిపారేశాడు. 

 

త‌ర్వాత ఇప్పుడు ప‌వ‌న్‌.. న‌టి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో త‌న త‌ల్లిపై చంద్ర‌బాబే ఆరోప‌ణ‌లు చేయించార‌ని దీనివెనుక పెద్ద కుట్ర ఉంద‌ని ఆరోపించారు. ఇలా మొత్తంగా ఇండ‌స్ట్రీకి-రాజ‌కీయాల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. మ‌రి ఈ రెండింటికీ సంబంధించిన వ్య‌క్తిగా బాల‌కృష్ణ ఏదో ఒక‌టి చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, బాల‌య్య మాత్రం త‌న రాజ‌కీయాల‌ను ఇక్క‌డ ప్లే చేశారు.  సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై దుమారం రేగి.. మీడియాతో పరిశ్రమకు వార్ న‌డుస్తున్న‌ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం  చిరంజీవి నేతృత్వంలో అగ్ర‌హీరోల బృందంతో ఒక కీలక సమావేశం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగులోని ప్రముఖ హీరోలందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించారు. దీనికి దాదాపుగా అందరు స్టార్ హీరోలూ హాజరయ్యారు. కానీ ఒక్క బాలయ్య మాత్రం ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నాడు. 

 

నిజానికి పరిశ్రమలో అందరూ కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేపట్టినా.. ఇంకేదైనా కార్యక్రమాలు తలపెట్టినా బాలయ్య చురుగ్గానే పాల్గొంటాడు. కానీ ఈ సమావేశానికి మాత్రం ఆయన గైర్హాజరు కాలేదు. దీంతో ప‌లు సందేహాలు తలెత్తాయి. పవన్ కళ్యాణ్.. టీడీపీకి అనుకూల చానెళ్లను లక్ష్యంగా చేసుకుని వాటిని బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేయడం.. ఆ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు కావడంతో తాను దీనికి హాజరైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని బాలయ్య భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సమావేశంలో తెలుగుదేశం అనుకూల మీడియాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకంటే తాను ఎటు నిలవాలో తెలియని సందిగ్ధత తలెత్తుతుందని బాలయ్య భావించినట్లు చెబుతున్నారు.  మొత్తంగా కీల‌క విష‌యంలో త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడ‌ని బాల‌య్య గురించి తెలిసిన వాళ్లు అంటున్నారు. 

 

పవన్ ఇష్యూ …. బాలయ్య రాజకీయం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share