వైసీపీలోకి టాలీవుడ్ టాప్ హీరోయిన్

August 21, 2018 at 10:36 am

ఏపీ రాజ‌కీయాల్లో సినీగ్లామ‌ర్ మ‌రింత‌గా పెరిగిపోతోంది. ఇప్ప‌టికే అగ్ర‌తార‌లు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. టీడీపీలో హీరో నంద‌మూరి బాల‌క‌`ష్ణ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. వైసీపీలో హీరోయిన్ రోజా ఉన్నారు. ఇక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతంగా జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేసుకుని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దూకారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ మ‌రికొంద‌రు సినీతార‌లు రాజ‌కీయాల్లో త‌ళుక్కుమంటార‌నే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్ర‌ముఖంగా.. అల‌నాటి అందాల తార‌.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసిన భామ‌.. అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో తెలుగు సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన జ‌య‌ప్ర‌ద కూడా తిరిగి ఏపీ రాజ‌కీయాల్లో అడుగుపెట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

Jayaprada-Entry-inTelugu

ఇప్ప‌టికే ములాయంసింగ్ పార్టీ నుంచి ఆమె రెండుసార్లు ఎంపీగా కూడా గెలిచిన విష‌యం తెలిసిందే. నిజానికి జ‌య‌ప్ర‌ద టీడీపీ నుంచి రాజ‌కీయ అరంగ్రేటం చేశారు. కానీ.. చంద్ర‌బాబు సముచిత స్థానం క‌ల్పించ‌లేద‌న్న అసంత‌`ప్తితో ఆమె ములాయంసింగ్ పార్టీలో చేరారు. ఉత్త‌ర భార‌త రాజ‌కీయాల్లో మంచి గుర్తింపు పొందారు. అయితే..ఆ పార్టీలో నెల‌కొన్నఅంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో ఆమె చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అది కూడా వైసీపీలో చేరి.. బ‌రిలోకి దిగాల‌ని చూస్తున్నార‌ట‌. ఇందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా జ‌య‌ప్ర‌ద రాక‌కు సానుకూలంగా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది.

తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు జ‌య‌ప్ర‌ద‌. మంచి వ‌క్త‌గా కూడా గుర్తింపు ఉన్న‌ ఆమె రాక‌తో పార్టీకి క‌లిసి వ‌స్తుంద‌నే అంచ‌నాల్లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో సినీతార‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌న‌సేన త‌రుపున కూడా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తార‌నే టాక్ వినిపిస్తోంది. నిజంగానే.. జ‌య‌ప్ర‌ద వైసీపీలో చేరితే.. ఏపీ రాజ‌కీయం ర‌స‌వ‌త్తంగా మారుతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Jaya-Prada

ప్ర‌స్తుతం యూత్‌లో మాంచి క్రేజీ ఉన్న ప‌వ‌న్ ఒక‌వైపు.. త‌న న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమాన లోకాన్ని సృష్టించుకున్న బాల‌క‌`ష్ణ మ‌రోవైపు.. ఆనాటి సినిమాల్లో మెరిసిన తార జ‌య‌ప్ర‌ద‌ల‌తో తెలుగు రాజ‌కీయం సినీగ్లామ‌ర్‌తో త‌డిసిపోతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇక తెలంగాణ‌లో విజ‌య‌శాంతి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

వైసీపీలోకి టాలీవుడ్ టాప్ హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share