కేసీఆర్‌కు ఈ స్థానాలలో అగ్ని ప‌రీక్షే…లెక్కకు మించే

November 20, 2017 at 4:41 pm
KCR, TRS, Telangana, candidates, MLA, MP

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ దురంధ‌రునిగా, మొండివాడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తాను అనుకున్న‌ది సాధించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి! తెలంగ‌ణ సాకార‌మ‌య్యే వ‌ర‌కు నిద్ర కూడా పోని కేసీఆర్‌.. రాష్ట్రం సాధించాక తానే సీఎం అయ్యారు. బంగారు తెలంగాణ సాకారం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈక్ర‌మంలో రాష్ట్రంలో అధికారం త‌మ చెంత‌నే ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌నే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి బలంగా తీసుకువెళ్లారు. టీఆర్ ఎస్ పార్టీ ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ‌లో అధికారంలోనే ఉంటుంద‌ని, అవ‌స‌ర‌మైతే.. కామ్మెడ్ జ్యోతి బ‌సు రికార్డును సైతం తిర‌గ‌రాస్తామ‌ని కేసీఆర్ ఉద్ఘాటించారు. అయితే, ఈ ప‌ద‌వీ కాంక్ష‌పై విప‌క్షాలు నిప్పులు చెరిగాయ‌నుకోండి.

ఇదిలావుంచితే, కేసీఆర్ త‌న సీటును భ‌ద్రంగా ఉంచుకోవ‌డం కోసం ప‌టిష్ట‌మైన ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఒకింత బ‌లంగా ఉన్న ప్ర‌తిప‌క్షాల్లోని కీల‌క నేత‌ల‌ను త‌న పంచ‌న క‌ట్టేసుకున్నారు. వీరంతా త‌న పంచ‌నే ఉంటే మిగిలిన ప‌క్షాల‌కు అభ్య‌ర్థులు కూడా ద‌క్కే ప‌రిస్థితి ఉండ‌ద‌ని కేసీఆర్ త‌ల‌పోస్తు్నారు. ఇక‌, గులాబీ బాస్ పిల‌వ‌గానే చెంగు చెంగున ఎగురుకుంటూ ప‌లువురు నేత‌లు కారెక్కారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. కేసీఆర్ ప్లాన్ స‌క్సెస్ అయినా.. రాబోయే ఎన్నిక‌ల సీజ‌న్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఇప్ప‌టి నుంచే చిక్కులు ఎదుర‌య్యేలా ఉన్నాయి. వివిధ పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌లు, ప్ర‌స్తుతం సిట్టింగులుగా ఉన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు చెక్ పెడ‌తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి అలా అయితే, సిట్టింగులు ఊరుకుంటారా? అనే సందేహాలూ వ్య‌క్తమ‌వుతున్నాయి. ఏదేమైనా ఒక సీటుకి సిట్టింగు ఎమ్మెల్యే లాదా ఎంపీ క‌లిపి ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారు ఆశావ‌హులు మొత్తంగా ముగ్గురు నుంచి న‌లుగురు పోటీ ప‌డుతున్నారు. దీంతో ఎంపిక ప్ర‌క్రియ అంత వీజీ కాద‌ని అంటున్నారు. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి కృషి చేస్తున్న‌వారు కూడా టిక్కెట్ల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక‌, సిట్టంగుల ప‌నితీరు బాగోలేద‌ని ప‌క్క‌కు పెట్టిన ఆశావ‌హుల ప‌రిస్థితి ఏమిటి? ఇక‌, కేసీఆర్‌ను న‌మ్ముకుని పార్టీల‌ను వ‌దిలి వ‌చ్చిన వారి భ‌విష్య‌త్తు మాటేంటి? ఇలాంటి అనేక స‌మ‌స్య‌లు ఇప్ప‌డు కేసీఆర్‌ను తీవ్ర ఇబ్బంది ప‌ట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఇక‌, ఏయే స్థానాలు కేసీఆర్‌కు అగ్ని ప‌రీక్ష‌గా మార‌తాయో చూద్దాం..

లోక్ సభ నియోజకవర్గాలు..

= పెద్దపల్లి: సిటింగ్ ఎంపీ బాల్క సుమన్. కొత్తగా టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ జి.వివేకానంద

= నాగర్ కర్నూలు: మందా జగన్నాథం (కాంగ్రెస్ నుంచి వచ్చారు) పి.రాములు (టికెట్ ను ఆశిస్తున్నారు)

అసెంబ్లీ నియోజకవర్గాలు

+ శేరిలింగంపల్లి: సిటింగ్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ – శంకర్ గౌడ్ – జగదీశ్వర్ గౌడ్ – రాగం నాగేందర్ గౌడ్

+ రాజేంద్రనగర్: సిటింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ – శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ – స్వర్ణలతా రెడ్డి టి.శ్రీనివాసరెడ్డి

+ కుత్బుల్లాపూర్: సిటింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద – కొలను హన్మంతరెడ్డి

+ కూకట్పల్లి: సిటింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు – గొట్టిముక్కల పద్మారావు

+ మేడ్చల్: సిటింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి – హరివర్థన్ రెడ్డి – నక్క ప్రభాకర్ గౌడ్

+ ఇబ్రహీంపట్నం: సిటింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి – కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

+ వరంగల్ తూర్పు: సిటింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ – మాజీ మంత్రి బస్వరాజు సారయ్య – మాజీ ఎంపీ గుండు సుధారాణి – ఎర్రబెల్లి ప్రదీప్ రావు – అచ్చ విద్యాసాగర్

+ భూపాలపల్లి: మధుసూదనాచారి – గండ్ర సత్యనారాయణరావు

+ చేవెళ్ల: సిటింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య (కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లో చేరారు) – మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ .రత్నం

షాద్నగర్: సిటింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ – అందె బాబయ్య – వీర్లపల్లి శంకర్ – కొందూటి నరేందర్

వికారాబాద్: సిటింగ్ ఎమ్మెల్యే సంజీవరావు – చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

+ మహేశ్వరం: సిటింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి లేదా ఆయన కోడలు డాక్టర్ తీగల అనితా రెడ్డి – కొత్త మనోహర్ రెడ్డి

+ అచ్చంపేట: సిటింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు – మాజీ మంత్రి పి.రాములు

+ కల్వకుర్తి: ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి – మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ – మార్కెట్ కమిటీ చైర్మన్ విజితా రెడ్డి

+ నారాయణపేట: సిటింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి – శివకుమార్ రెడ్డి

+ ఖానాపూర్: సిటింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ – మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్

+ నిజామాబాద్ రూరల్: సిటింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ – ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

+ మథిర: జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత – బొమ్మెర రామ్మూర్తి – లింగాల కమల్ రాజ్

+ మునుగోడు: సిటింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

+ దేవరకొండ: సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ (సీపీఐ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లో చేరారు) – మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్

+ మిర్యాలగూడ: సిటింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు (కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లో చేరారు) – అలుగుపెల్లి అమరేందర్ రెడ్డి

+ కొడంగల్: ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి -మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి లేదా ముద్దప్ప దేశ్ ముఖ్

+ నల్లగొండ: భూపాల్ రెడ్డి – నర్సింహా రెడ్డి

 

కేసీఆర్‌కు ఈ స్థానాలలో అగ్ని ప‌రీక్షే…లెక్కకు మించే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share