గులాబీలోకి వలసలు ఇంకా ఉన్నాయా?

September 8, 2018 at 7:01 pm

ఇతర పార్టీలనుంచి బలమైన నాయకులను వీలైనంత మందిని తమవైపునకు ఆకట్టుకోవడం ద్వారా ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి చాలా బలాన్ని సంతరించుకున్నదనే మాట వాస్తవం. ఇటు తెలుగుదేశం, అటు కాంగ్రెస్ నుంచి ఎంతో మంది ఆ పార్టీలోకి చేరిపోయారు. ఇటీవలే.. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ కు కీలక నాయకుడు దానం నాగేందర్ కూడా వెళ్లి చేరారు. ముందస్తు ప్రకటన వచ్చిన తరువాత.. 105 స్థానాల టికెట్లు ప్రకటించేసిన తర్వాత.. తనకంటూ ఎలాంటి సీటుకు అవకాశం లేకపోయినప్పటికీ.. మాజీ స్పీకరు సురేష్ రెడ్డి కూడా తెరాసలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికీ వలసలు జరగడం అనేది కీలకపరిణామం.

అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వలసలు ఇంతటితో అయిపోలేదని… ముందుముందు ఇంకా కొందరు కాంగ్రెస్ నాయకులు తెరాసలోకి ఫిరాయించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ రెడ్డి నిజామాబాద్ లోని ఆర్మూర్ లేదా బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకుడు. అక్కడ టికెట్లు ప్రకటించేసిన తర్వాత కూడా ఆయన తెరాసలోకి వస్తున్నారు. ఆయన కేవలం డీఎస్ ను తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నందుకు అలిగి, తెరాసలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

కాగా మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కూడా తెరాస వలవిసరి కూర్చుంది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి లతో కేటీఆర్ మంతనాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. మాజీ ఎంపీ వివేక్ నివాసంలో వీరితో కేటీఆర్ చర్చించారుట. పార్టీలోకి ఆహ్వానించి.. సముచిత గౌరవం దక్కేలా చూస్తామని మాట ఇచ్చారుట. కాంగ్రెస్ కు ఈ ఇద్దరూ గట్టి నాయకులే లెక్క. అయితే తెరాస వ్యూహాత్మకంగా ఈ ఇద్దరి స్థానాలకు తొలిజాబితాలో అభ్యర్థులను ప్రకటించకుండా.. ఖాళీ ఉంచింది. దానిని బట్టి.. వారు కూడా ఖచ్చితంగా తెరాసలోకి వస్తున్నట్లు సమాచారం. వీరితో పాటూ టికెట్లు ఖాళీ లేకపోయినా.. ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఎరవేసి మరికొందరు కాంగ్రెస్ నాయకుల్ని కూడా తెరాస ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.

201809071727495578_Jolt-to-Congress-as-exAndhra-Speaker-joins-TRS_SECVPF

గులాబీలోకి వలసలు ఇంకా ఉన్నాయా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share