మంత్రివ‌ర్గంలోకి తుమ్మల‌…వారికి బుద్ధి చెప్పేందుకేనా!

February 9, 2019 at 4:56 pm

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆ అభిమాన‌మే గ‌త ప్ర‌భుత్వంలో ఆయ‌న్ను మంత్రిగా చేసింది. ఇప్పుడు కూడా ఆయ‌న ఓడినా… మంత్రి కొలువు మాత్రం ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టేందుకే కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అధికారుల‌ను ఉరుకులు..ప‌రుగులు పెట్టించ‌గ‌ల‌డు…మంచి స‌బ్జెక్ట్ వైజ్‌గా మాట్లాడే సామ‌ర్థ్యం ఉన్న నేత‌గా గుర్తింపు పొందాడు. గ‌తంలో టీడీపీలో కేసీఆర్‌..తుమ్మ‌ల ఇద్ద‌రు క‌ల‌సి ప‌నిచేశారు. ఇద్ద‌రు మంత్రులుగా కొలువుదీరారు. అదే సాన్నిహిత్యంతో టీఆర్ ఎస్‌లోకి తుమ్మ‌ల‌ను కేసీఆర్ ఆహ్వానించారు. టీడీపీలో ఉంటే లాభం లేద‌నుకుని గులాబీ కండువా కప్పుకుని పార్టీని ఖ‌మ్మంలో బ‌లోపేతం చేశాడు. ఓ ద‌శ‌లో ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లా మొత్తం టీఆర్ ఎస్ ఏకాఛ‌త్రాధిప‌త్యం కింద‌కు వ‌చ్చింది.

 

Tummala-Nageswara-Rao-To-Mediate-Between-KCR-and-Chandrababu-Naidu

కాంగ్రెస్ కంచుకోట‌లుగా కూడా టీఆర్ ఎస్ అప్ర‌తిహ‌త విస్త‌`తితో భీతిల్లయ్యాయి. అదే ఊపులో ఉప ఎన్నిక‌ల్లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తుమ్మ‌ల విజ‌యం సాధించారు. ఇక తుమ్మ‌ల‌కు తిరుగులేద‌ని అనుకున్న స‌మ‌యంలో అనుహ్యంగా ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. చిన్న‌బోయిన తుమ్మ‌ల‌ను మాత్రం పార్టీ అధినేత చేర‌దీశారు. పార్టీకి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తిస్తుంద‌ని ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ గెలిచిన వారికే మంత్రి ప‌ద‌వులు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే తుమ్మ‌ల‌కు మాత్రం అందులో మిన‌హాయింపు ల‌భించ‌నుంద‌ని తెలుస్తోంది. తుమ్మ‌ల‌కు ఖ‌చ్చితంగా ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని, అది కూడా మొద‌టి విడ‌త‌లోనే ఉంటుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల ద్వారా వెల్ల‌డ‌వుతోంది.

ఖ‌మ్మంలో పార్టీ ప్రాతినిధ్యం కోరుకుంటోంద‌ని, తుమ్మ‌ల‌తోనే ఆ జిల్లాలో పార్టీ మ‌ళ్లీ పాతుకుపోగ‌ల‌ద‌ని కేసీఆర్ బ‌లంగా విశ్వ‌సిస్తుండ‌టమే ఇందుకు కార‌ణ‌మ‌ట‌. ఇక తుమ్మ‌ల ఓడిపోవ‌డానికి కొన్ని అంత‌ర్గ‌త శ‌క్తులు కూడా ప‌నిచేశాయ‌ని తెలుసుకున్న కేసీఆర్ వారికి బుద్ధి చెప్ప‌డానికి కూడా ఈ మంత్రి ప‌ద‌విని తుమ్మ‌ల‌కు అప్ప‌జెప్ప‌డం ద్వారా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. అయితే గ‌తంలో తుమ్మ‌ల స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించిన రోడ్లు భ‌వ‌నాల శాఖనే మ‌ళ్లీ తుమ్మ‌ల‌కు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. అద‌యితేనే మంచి ప‌ట్టు ఉంటుంది…రోడ్ల విస్త‌ర‌ణ‌కు..కొత్త మార్గాల‌కు ఈ ప్ర‌భుత్వంలో చాలా ప్రాధాన్యం ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌యితేనే స‌రిగ్గా ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. ఏది ఏమైనా రెండు రోజులు ఆగితేగాని ఈ విష‌యంపై క్లారిటీ రాదు.

మంత్రివ‌ర్గంలోకి తుమ్మల‌…వారికి బుద్ధి చెప్పేందుకేనా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share