29 ఏళ్ల యువ‌కుడు మోడీ – షా ప‌రువు తీసేశాడు

March 15, 2018 at 5:55 pm
UP Elections, nishad, MP, Win, modi, Amith shah, Yogi

ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా యూపీలోని గోర‌ఖ్‌పూర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్పీ గెలుపు గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఇక్క‌డ ఎస్పీ గెలుపు కంటే గోర‌ఖ్‌పూర్‌తో పాటు పుల్పూర్ లోక్‌స‌భ స్థానంలోనూ ఎస్పీ గెలిచి బీజేపీ ఓడింది. ఈ రెండు సీట్ల‌లో బీజేపీ ఓడిపోవ‌డం వెన‌క చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. గోర‌ఖ్‌పూర్‌, పుల్పూర్ లోక్‌స‌భ సీట్లు యూపీ సీఎం, డిప్యూటీ సీఎం ఖాళీ చేసిన స్థానాలు. అందులోనూ గోర‌ఖ్‌పూర్ అయితే యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు గ‌త మూడు ద‌శాబ్దాలుగా కంచుకోట‌.

 

ఇక పుల్పూర్ ఒకప్పుడు కాంగ్రెస్‌కు తిరుగులేని క్రేజ్ ఉన్న స్థానం. అక్క‌డ నుంచి మాజీ ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సైతం లోక్‌స‌భ‌కు ప్రాథినిత్యం వ‌హించిన చ‌రిత్ర ఉంది. అలాంటి చ‌రిత్ర ఉన్న సీట్ల‌లో ఇప్పుడు బీజేపీ ఘోరంగా మ‌ట్టి క‌రిచింది. ఇక ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓట‌మి దేశ‌వ్యాప్తంగా ఉన్న బీజేపీ యాంటీ అభిమానుల‌కే కాదు ఎన్డీయేలో బీజేపీ ఏక‌ప‌క్ష వైఖ‌రి న‌చ్చ‌ని వాళ్ల‌కు సైతం సంబ‌రాలు చేసుకుంటున్నారు.

 

ఇక యూపీలో గ‌త ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం త‌ర్వాత జ‌రిగిన ఈ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే అని అంద‌రూ అనుకున్నారు. ఇక యూపీ సీఎం రాజీనామా చేసిన గోర‌ఖ్‌పూర్‌లో గ‌త మూడు ద‌శాబ్దాలుగా బీజేపీకి తిరుగులేదు. అక్క‌డ మూడు ద‌శాబ్దాలుగా బీజేపీ జెండానే ఎగురుతోంది. అలాంటి చోట ఎస్పీ విజ‌యం యోగి ప‌రువే కాదు యూపీ చూసుకుని విర్ర‌వీగే ప్ర‌ధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌రువు కూడా తీసేసింది.

praveennisad

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ఉప ఎన్నికల్లో 29వ నెంబర్‌ గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 29 ఏళ్ల వయసున్న యువకుడు 29 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న బీజేపీకి ఎవరూ ఊహించని విధంగా బ్రేక్‌ వేశాడు. ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు గోర‌ఖ్‌పూర్ మ‌ఠంలోని పూజారులే ఎంపీలుగా గెలుస్తూ వ‌స్తున్నారు. ఇక ఇక్క‌డ బీఎస్పీ + ఎస్పీ క‌లిసి పోటీ చేయ‌డంతో ఎస్పీ గెలుపు సులువు అయ్యింది. ఇక్క‌డ ఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ప్ర‌వీణ్‌కుమార్ నిషాద్  వయసు కూడా 29 ఏళ్లు. నిషాద్‌ను ఎన్నికల్లో దింపే వరకు కూడా అతడు పెద్దగా ఎవరికీ తెలియదు. ఓ 29 ఏళ్ల యువ‌కుడు గోర‌ఖ్‌పూర్ సామ్రాజ్యాన్ని కూల‌దోశారంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

 

ఈ ఎన్నిక‌ల్లో గెలిచే వ‌ర‌కు నిషాద్ పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌దు. అత‌డు లక్నోలోని గౌతం బుద్ద యూనివర్సిటలో ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశాడు. 2011లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. అతడిపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు. అఫిడవిట్‌ ప్రకారం అతడి ఆస్తులు రూ.11లక్షల లోపే. అందులోను రూ.99,000 లోన్‌ కూడా ఉంది. అతడి భార్య ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

29 ఏళ్ల యువ‌కుడు మోడీ – షా ప‌రువు తీసేశాడు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share