ఉత్తమ్, రేవంత్ ల మధ్య సీట్ల రచ్చ!

November 8, 2018 at 9:46 am
Utham Kumar, Revanth Reddy, Seats Allocation, Telangana, Congress

మ‌హాకూట‌మి సీట్ల స‌ర్దుబాటు విష‌యమేమోగానీ.. కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంప‌కం మాత్రం ప్ర‌కంప‌న‌లు స‌`ష్టించే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఓవైపు అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ ఇంకా సీట్ల కేటాయింపు వ‌ద్దే ఊగిస‌లాడుతోంది. టీడీపీకి 14, తెలంగాణ జ‌న స‌మితికి 8 సీట్లు ఇచ్చేందుకు సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించినా ఫైన‌ల్ మాత్రం కాలేదు. వీళ్ల‌కు ఏయే స్థానాలు కేటాయిస్తార‌న్న‌ది మ‌రో పెద్ద స‌మ‌స్య‌. ఇదిలా ఉండ‌గా.. ఉత్త‌మ్‌, రేవంత్ మ‌ధ్య సీట్ల కేటాయింపు విష‌యంలో విభేదాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఎవ‌రి అనుచ‌రుల‌కు వారు టికెట్లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలిసింది. స్ర్కీనింగ్ క‌మిటీ సమావేశంలో వీరిద్ద‌రూ కూడా త‌మ‌త‌మ అనుచ‌రులకు టికెట్ల కోసం గ‌ట్టిగా వాదించుకున్న‌ట్లు స‌మాచారం.

dc-Cover-bsnudco08r3igtj44duecnr7m4-20180321015234.Medi

అయితే.. మెజార్టీ సీట్ల విష‌యంలో క్లార‌టీ వ‌చ్చినా.. సుమారు 15సీట్ల విష‌యంలో మాత్రం పీట‌ముడి ఉంది. ఇక గురువారం సోనియాగాంధీ స‌మ‌క్షంలో జ‌రిగే ఎన్నిక‌ల క‌మిటీ భేటీలో మొత్తం సీట్ల స‌ర్దుబాటుపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక ఆ త‌ర్వాత శుక్ర‌వారం అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక్క‌డ మ‌రో అంశం ఏమిటంటే.. బీసీ వ‌ర్గాల‌కు టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో సుమారు 30 నుంచి 35సీట్లు బీసీవ‌ర్గాల‌కు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. ఈ సారి ప‌లువురు మాజీ ఎంపీల‌ను కూడా ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది.

ఈ జాబితాలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేష్‌ షెట్కార్, విజయశాంతి, బలరాం నాయక్, మల్లు రవి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ తుది జాబితాలో చేర్చినట్టు సమాచారం. కరీంనగర్‌ నుంచి పొన్నం ప్ర‌భాక‌ర్‌, సురేష్‌ షెట్కార్‌ నారాయణఖేడ్‌ నుంచి, బలరాం నాయక్‌ మహబూబాబాద్‌ నుంచి, విజయశాంతి మెదక్‌ నుంచి, మల్లు రవి జడ్చర్ల నుం చి పోటీ చేసేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా టికెట్ల కోసం పోటీ బాగా ఉన్న‌చోట ఇద్ద‌రి పేర్లను జాబితాలో చేర్చారు. మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవిందరెడ్డి మధ్య, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే.. రేవంత్‌రెడ్డితోపాటు ప‌టేల్ ర‌మేశ్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇక‌ దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి పలుమార్లు గెలిచారు. వీరిలో ఎవ‌రికి టికెట్ వ‌స్తుందో చూడాలి మ‌రి.

ఉత్తమ్, రేవంత్ ల మధ్య సీట్ల రచ్చ!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share