విశాఖ‌పై విజ‌య‌సాయి క‌న్ను.. ఎంపీగా బ‌రిలోకి?

April 25, 2018 at 6:03 pm
Vijay sai reddy, MP, vizag, YSRCP, Ys jagan

ప్ర‌ముఖ ఆడిట‌ర్‌, వైఎస్ కుటుంబానికి ఆప్తుడు, ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి రాష్ట్రంలోనే ప్ర‌ధాన ఐటీ కేంద్రం విశాఖలో పాగా వేసేందుకు పావులు క‌దుపుతున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఆయ‌న ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైఎస్ మాతృమూర్తి.. విజ‌య‌మ్మ పోటీ చేశారు. అయితే, అప్ప‌టి హోరులో బీజేపీ అభ్య‌ర్థి కంభంపాటిపై ఓడిపోయారు. అయితే, ఈ స్థానంపై విజ‌య‌సాయి క‌న్నేశార‌ని తాజా గా అందుతున్న స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్ప‌టి నుంచి విశాఖ‌పై గురి పెట్టార‌ని తెలుస్తోం ది. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. అయితే, ప్ర‌జాక్షేత్రంలో గెలుపొంద‌డం ద్వారాలోక్‌స‌భ‌కు ఎన్నిక కావాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. 

 

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న విశాఖ‌లో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 72 వార్డుల్లో 10 రోజుల పాటు 180 కిలోమీటర్లు విజయసాయి పాదయాత్ర చేయ‌నున్నార‌ని వైసీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ తెలిపారు. త‌ద్వారా విశాఖ ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు విజ‌య సాయి ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం. గ‌త రెండేళ్లుగా కూడా విజ‌య‌సాయి విశాఖ‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఏదైనా కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డంలోనూ విశాఖ‌నే ఆయ‌న ఎంచుకున్నారు. విశాఖ‌లో వార్డుల వారిగా కూడా ఆయ‌న ప‌ట్టు సాధించారు. ఇత‌ర పార్టీల లోటు పాట్ల‌ను సైతం ఆయ‌న అధ్య‌యనం చేయ‌గ‌లిగారు. 

 

ఇక‌, విశాఖ‌నే విజ‌య‌సాయి ఎంచుకోవ‌డం వెనుక కీల‌క‌మైన రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక ల్లో ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి గా కంభంపాటి హ‌రిబాబు గెలుపొందారు. అయితే, ఇక్క‌డ టీడీపీ-బీజేపీల బ‌లంతోనే ఆయ‌న విజ‌యం సాధించారు త‌ప్ప ఒంట‌రిగా మాత్రం కాదు. ఈ ప‌రిణామం త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని విజ‌య‌సాయి భావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ-బీజేపీలు విడిపోయాయి. దీంతో ఇక్క‌డ ఈ రెండు పార్టీలూ విడివిడిగానే పోటీ చేయాలి. అలా చేసినా.. విశాఖ‌కు రైల్వే జోన్ ఇవ్వ‌డంలో బీజేపీ విఫ‌ల‌మైంది. దీనిని సాధించ‌డంలో స్థానిక టీడీపీ కూడా విఫ‌ల‌మైంది. ఈ ప‌రిణామాల‌ను విజ‌యసాయి త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు రెడీ అవుతున్నారు. 

 

అదేవిధంగా ఇక్క‌డ పారిశ్రామిక ప్రాంతం కావ‌డం, త‌న‌కు వివిధ ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఉండ‌డం కూడా లాభిస్తుంద‌ని విజ‌య‌సాయి అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాను ఒంట‌రిగా వైసీపీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకు వెళ్లేందుకు రెడీఅయ్యారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చ‌స్తున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు సంఘీభావం అంటూనే.. తెర‌వెనుక త‌న ఎంపీ టికెట్ కోసం.. విజ‌య‌సాయి వేదిక సిద్ధం చేసుకుంటున్నాడ‌ని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

విశాఖ‌పై విజ‌య‌సాయి క‌న్ను.. ఎంపీగా బ‌రిలోకి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share