రాములమ్మ పవర్ తగ్గిందా…!

October 5, 2018 at 7:49 pm

టాలీవుడ్ లో 90వ దశకంలో తన అందాలతో కుర్రాళ మనసు దోచిన హీరోయిన్ విజయశాంతి. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన విజయశాంతి తర్వాత కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతిఘటన, కర్తవ్యం లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విజయశాంతికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేది. సినిమాలో మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయశాంతి బీజేపీ పార్టీలో చేరింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది.

vijayashanthi.jpg.image.784.410

ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి..మెదక్ ఎంపిగా కొనసాగారు. అప్పట్లో కేసీఆర్ కి చెల్లెమ్మ అంటూ వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ కి విజయశాంతికి మద్య విభేదాలు రావడంతో ఆమె పార్టీని విడారు. తర్వాత కాంగ్రెస్ లో చేరినప్పటికీ నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో విజయశాంతి మళ్లీ యాక్టీవ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న కొన్ని సభలలో ఆమె కెసిఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకు పడింది.

అయితే ఇక్కడకు వచ్చిన కార్యకర్తలకు అభిమానులను చూస్తుంటే సంతోషంగా ఉందన్న విజయశాంతి..కేసీఆర్ పై విపరీతమైన వ్యాఖ్యలు చేసింది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రగతి భవన్ లో, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు..అక్కడే ఆయన పనులు చేసుకుంటూ వచ్చారని విమర్శించింది. అయితే ఈ విమర్శలపై ఇప్పుడు నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ కూర్చొని పనిచేస్తే నీకేంటీ..ఇంతకూ నువ్వు ఇన్నాళ్లు ఎక్కడున్నావ్..కంటికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లావు..ఇప్పుడు ఎన్నికంటే..ప్రజలు గుర్తుకొచ్చారా అని విమర్శిస్తున్నారు.

ఇక కెసీఆర్ ని ఓసేయ్ రాములమ్మ సినిమాలో రాంరెడ్డితో పోల్చిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై కూడా కొంత మంది వ్యంగస్త్రాలు సందిస్తున్నారు. ఎప్పుడో విజయశాంతి నటించిన ఓసేయ్ రాములమ్మ సినిమా ఇంకా మర్చిపోలేదనుకుంటా..అందుకే పదే పదే ఆ సినిమా గుర్తుచేస్తూ అప్ డేట్ చేసుకుంటుందని..ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల బాగోగులు పట్టించుకోని విజయశాంతి ఎన్నికలు అనగానే.. ప్రత్యక్షమై, ఉపన్యాసాలు ఇస్తే బహుశా అవి ఇలాగే ఉంటాయి ఏమో అని జనాలు అనుకోవడం కనిపించింది.

రాములమ్మ పవర్ తగ్గిందా…!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share