రాములమ్మ భ‌లే చాన్స్ కొట్టేసిందే..!

September 20, 2018 at 9:00 am

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న రాముల‌మ్మ భ‌లే చాన్స్ కొట్టేసింది. ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపెన‌ర్‌గా అవ‌కాశం ద‌క్కించుకుంది. ఆమెను జ‌నం మ‌రిచిపోయిన త‌రుణంలో పార్టీ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. పార్టీలో హేమాహేమీలు ఉండ‌గా.. పార్టీకి దూరంగా ఉన్న విజ‌య‌శాంతికి ఎన్నిక‌ల ప్ర‌ధాన ప్ర‌చార‌క‌ర్త‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

జానారెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి త‌దిత‌ర సీనియ‌ర్లు ఉన్నా.. రాముల‌మ్మ‌కే స్టార్ క్యాంపెయిన‌ర్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. స్టార్ హీరోల‌కు ఏమాంత్ర తీసిపోని ఇమేజ్ ఉన్న విజ‌య‌శాంతితోనే ఈ త‌క్కువ కాలంలో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్శించ‌వ‌చ్చ‌న్న న‌మ్మ‌కంతోనే ఈ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది.

నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌రిలోకి దిగి ఓడిపోయిన‌ త‌ర్వాత విజ‌య‌శాంతి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేదు. ఎక్క‌డ కూడా జ‌నానికి క‌నిపించ‌లేదు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై కూడా చిన్న కామెంట్ కూడా లేయ‌లేదు. అయితే.. అనారోగ్య కార‌ణాల రీత్యానే ఆమె పార్టీకి దూరంగా ఉన్న‌ట్లు మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది.

Vijayashanti-plan-to-re-join-BJP

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం చేప‌ట్టిన ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర‌లో రాముల‌మ్మ‌కే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే టాక్ అప్ప‌ట్లో వ‌చ్చినా.. అది వ‌ట్టి ఊహాగానాలేనని తేలిపోయింది. బ‌స్సుయాత్ర‌లో కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇక రాముల‌మ్మ రాజ‌కీయాల‌కు బైబై చెప్పిన‌ట్టేన‌నే టాక్ వినిపించింది. కానీ.. ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌లో మ‌హంకాళి అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించ‌డంతో రాముల‌మ్మ రీఎంట్రీ ఖాయంగానే క‌నిపించింది.

ఈ క్ర‌మంలోనే ఆమె ఓ కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఈ నెల 15వ తేదీ త‌ర్వాత పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పారు. మ‌రోవైపు కాంగ్రెస్‌-టీడీపీల పొత్తుపై కూడా ఆమె కొంత అసంత‌`ప్తి వ్య‌క్తం చేశారు. ఏదేమైనా.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు ప్ర‌చారంలో దూసుకుపోతున్న వేళ‌.. కాంగ్రెస్ పార్టీ రాముల‌మ్మ‌కు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా బాధ్య‌తలు అప్ప‌గించింది.

అతిత‌క్కువ కాలంలో పార్టీ అభ్య‌ర్థులు జ‌నంలోకి వెళ్లాలంటే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్‌, నాయ‌కురాలు విజ‌య‌శాంతితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని పార్టీ పెద్ద‌లు న‌మ్ముతున్నారు. మ‌రి ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడ‌ని ఆమె.. ఇప్పుడు ఏం మాట్లాడుతుందోన‌నే టాక్ అప్పుడే మొద‌లైంది. గ‌త ఎన్నిక‌ల్లో క‌న‌బ‌డి.. ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల ముంగిట వ‌స్తున్న విజ‌య‌శాంతిని జ‌నం, పార్టీ క్యాడ‌ర్ ఏ మేర‌కు రిసీవ్ చేసుకుంటారో చూడాలి మ‌రి.

రాములమ్మ భ‌లే చాన్స్ కొట్టేసిందే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share