బోండాపై వైసీపీ గెలుపు ఖాయమేనా!

July 7, 2018 at 9:20 am
bonda Uma

అవును! రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. మొత్తంగా గెలుస్తామ‌ని అనుకున్న నాయ‌కులు త‌ల్ల‌కిందులుగా ప‌డి ఓడిన ప‌రిస్థితులు అనేకం ఉన్నాయి. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా గెలుపు నాదే అనే నాయ‌కులు.. ఓడిపోయిన ప‌రిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లోనూ ఉంది. ఇక్క‌డ గెలుపు నాదే అని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు చాప‌కింద నీరులాగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క కాద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వైసీపీ గోరంత క‌ష్ట‌ప‌డితే.. కొండంత ఫ‌లితం తెచ్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఆస‌క్తిక‌ర‌మైన ఈ విష‌యంలో ఏంటో చూద్దామా..?!

విజ‌య వాడ‌లో కీల‌క‌మైన సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమాపై ప్ర‌జ‌ల్లో చాప‌కింద నీరులా వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో త‌న వ‌ర్గం అనుకున్న వారికే ఆయ‌న ప‌నులు చేసి పెడుతున్నార‌ని, మిగిలిన వారిని ప‌ట్టించుకోవ‌డం లేదని గ‌త రెండేళ్లుగా ఇక్క‌డ భారీ ఎత్తున వినిపిస్తున్న మాట‌. త‌న పార్టీకి చెందిన వారికే ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయ‌డం ఏడాది కిందట పెద్ద క‌ల‌క‌లం రేపింది. ఇక‌, చిన్న‌వారిని ప‌ట్టించుకునే తీరిక కూడా స్థానిక ఎమ్మెల్యేకి ఉండ‌ద‌ని ప్ర‌జ‌లు పెద్ద‌గా చెప్పుకోవ‌డం ష‌రా మామూలే అయింది. అంతేకాదు.. ఎమ్మెల్యేని క‌ల‌వాలంటే.. రెండు మూడు అంచెలు దాటి వెళ్లాల్సి రావ‌డం మ‌రో మైన‌స్‌.

వీటికితోడు ఆయ‌న‌పై పెద్ద ఎత్తున భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. పోలీసులు కేసులు కూడా న‌మోదు చేశారు. ఇక‌, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను సైతం ఆయ‌న తూ..తూ.. మంత్రంగానే కానిచ్చేస్తున్నారు. రేష‌న్‌, పింఛ‌న్లు అంద‌ని వారూ ఎక్కువ‌గా నే ఉన్నారు. కాగా, త‌నను మంత్రి వ‌ర్గంలోకి తీసుకోలేదని అలిగిన సంద‌ర్భాలూ తెలిసిన‌వే. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వారిని నియ‌మించి వ‌సూళ్లు చేయిస్తున్నా ర‌ని తాజాగా వ‌స్తున్న ఆరోప‌ణ‌లు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ప్ర‌త్యామ్నాయ నేత కోసం ప్ర‌జలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్క‌డ క్లాస్ మాస్ క‌ల‌గ‌లుపుగా ఉన్న ఓట‌ర్లు అధిక‌శాతంలోఉన్నారు.

ఈ నేప‌థ్యంలో మాస్ జ‌నాన్ని ఆక‌ట్టుకునేందుకు కీల‌క నేత ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగితే.. ప్ర‌జ‌లు వెంట‌నే ఫిదా అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేవిధంగా క్లాస్ జ‌నాలు కూడా బొండా కు వ్య‌తిరేకంగానే ఉన్నార‌ని,ముఖ్యంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎమ్మెల్యే నిధుల‌తో ఒక‌టి రెండు క‌మ్యూనిటీ భ‌వ‌నాలు నిర్మించి చేతులు దులుపుకొన్నాడు త‌ప్ప‌.. ఆయ‌న చేసిందేమీ లేద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా గెలుపు సునాయాశ‌మేన‌ని అంటున్నారు. మ‌రి వైసీపీ నాయ‌క‌త్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

బోండాపై వైసీపీ గెలుపు ఖాయమేనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share