ఓటుకు కోటి.. ఏపీలో సంచలనం!

November 21, 2018 at 9:13 am

ఓటుకు కోటి రూపాయ‌లు.. ఒక్క ఓటుకు కోటి రూపాయ‌లా..! ఇంత భారీ మొత్తంలో ఇస్తారా..! అని నోరెళ్ల‌బెట్ట‌కండి..! మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే మ‌రి. ఈ విష‌యం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. దీనిపై అటు ప్ర‌భుత్వవ‌ర్గాల్లో, ఇటు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. ఓటుకు కోటి ఇచ్చేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అని మాత్రం అనుకోకండి.. ఇదీ ఏపీ ముచ్చ‌ట‌. అరెరె.. ఏపీలో ఎన్నిక‌లే జ‌ర‌గ‌డం లేదు..మ‌రి ఓటుకు కోటి ఎలా ఇస్తారు..? అని మీకు డౌటు వ‌స్తోంది క‌దా..! మీ డౌటు నిజ‌మే. ఇక దాని సంగ‌తేమిటో తెలుసుకుందాం..

dont-sell-your-vote-for-note

ఈ ప్ర‌చారం ఏపీకి సంబంధించిన అంశ‌మే. ఓటుకు కోటి.. ఇస్తున్న ప్ర‌చారం జ‌ర‌గ‌డంలో సీఎంవో వ‌ర్గాలు వెంట‌నే అల‌ర్ట్ అయ్యాయి. ఈ ప్ర‌చారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఆరా తీయ‌గా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగుచూసింది. అయితే.. ప్ర‌చారం ఏపీ బార్‌కౌన్సిల్ ఎన్నిక‌ల‌కు సంబంధించినది కావ‌డం గ‌మ‌నార్హం. బార్‌కౌన్సిల్ ఎన్నిక‌ల్లో 23వేల మంది న్యాయ‌వాదులు ఇప్ప‌టికే 25మంది స‌భ్యుల‌ను ఎన్నుకున్నారు. ఈ స‌భ్యులంద‌రూ క‌లిసి బార్ కౌన్సిల్ చైర్మ‌న్‌కు ఎన్నుకోవాలి. ఈ నేప‌థ్యంలోనే ఈ ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

చైర్మ‌న్ ప‌ద‌వికి భారీ డిమాండ్ ఉండ‌డంతో ఓటుకు కోటి రూపాయ‌లు ఇచ్చేందుకు కూడా వెనుకాడ‌డం లేద‌ని ప‌లువురు సీఎంవో ఫిర్యాదులు చేసిన‌ట్లు స‌మాచారం. వెంట‌నే సీఎం వ‌ర్గాలు ఏసీబీ అలర్ట్ చేసిన‌ట్లు తెలిసింది. అయితే.. ఈ ప్ర‌చారం, ఫిర్యాదుల‌పై ప్రాథ‌మిక ప‌రిశీల‌న చేప‌ట్టిన త‌ర్వాత దాని సంగతి చూస్తామ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ఇంత‌కీ ఆ ప‌ద‌వికి అంత డిమాండ్ ఏమిటంటే.. ఐదేళ్ల‌ చైర్మ‌న్ ప‌ద‌వి అనేక అంశాల‌కు సంబంధించిన నిర్ణ‌యాధికారాలు క‌లిగి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో చైర్మ‌న్ ప‌ద‌విని పొందేందుకు ఓటుకు కోటి ఇచ్చేందుకు వెనుకాడ‌డం లేదు.

ఓటుకు కోటి.. ఏపీలో సంచలనం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share