య‌న‌మ‌ల‌కు స‌వాల్‌.. బాబుకు ప్ర‌తిష్ట‌…!

August 21, 2018 at 9:50 am

ఎంత సీనియ‌ర్ నేతైనా.. ప్ర‌జ‌ల ఆశీర్వాదం..అంగీకారం లేక‌పోతే.. రాజ‌కీయాల్లో ఒడిదుడుకులు త‌ప్ప‌వ‌ని చెప్ప‌డానికి ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు య‌న‌మ‌ల రామకృష్ణుడే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. రాజ‌కీయాలు ఎలా చేశామ‌న్నది ఎంత ముఖ్య‌మో.. ప్ర‌జ‌ల్లో ఎంత మేర‌కు అభిమానం సంపాయించుకున్నామ‌నే విష‌యం కూడా అంతే ముఖ్యం. య‌న‌మ‌ల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడే అయినా.. ప్ర‌జ‌ల్లో గ‌డిచిన ప‌దేళ్లుగా అభిమానాన్ని సంపాయించుకోలేక పోతున్నారు. దీంతో ఈయ‌న‌పై వ‌చ్చే ఎన్నిక‌ల ఒత్తిడి భారీగా ప‌డ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

hqdefault

విష‌యంలోకి వెళ్తే.. తూర్పుగోదావ‌రి జిల్లా తుని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం య‌న‌మ‌ల‌కు పెట్ట‌ని కోట! టీడీపీలో చేరిన నాటి నుంచి ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 1989 ఎన్నిక‌ల నుంచి 2004 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లు వ‌రుస పెట్టి య‌న‌మ‌ల‌ను గెలిపిస్తున్నారు. అయితే, 2009, 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ య‌న‌మ‌ల హ‌వా భారీ రేంజ్‌లో త‌గ్గిపోయింది. ఈ ప‌రిణామం నిజంగా య‌న‌మ‌ల వంటి దిగ్గ‌జ‌నాయ‌కుడికి పెను స‌వాలుగా మారింది. 2009 ఎన్నికల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన య‌న‌మ‌ల‌.. కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజా అశోక్‌బాబు చేతిలో ఓటమి చెందారు.

ఇక‌, 2014 ఎన్నికల సమయంలో రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉండటంతో ఆయన స్థానంలో సోదరుడు య‌న‌మ‌ల‌ కృష్ణుడు(ప‌ళ్ల కృష్ణుడు)ను తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లోనూ యనమలకి ఓటమి తప్పలేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి దాడిశెట్టి రాజా భారీ విజ‌యం సాధించారు. అయితే, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికా రంలోకి రావడంతో పమ్మెల్సీగా ఉన్న యనమల ఆర్ధికమంత్రి అయ్యారు. కాగా వచ్చే 2019 ఎన్నికల్లో తునిలో విజయం తెలుగుదేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారగా, యనమలకు సవాల్‌గా నిలిచింది.

world-food-india_b6ee2cda-2607-11e8-a8dd-98cd3615fcfa

ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిందేనని, మూడోసారి కనుక పరాజయం పాలైతే రాజకీయంగా చాలా దెబ్బ తినే ప్రమాదముందని యనమల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో గ‌డిచిన మూడు నెల‌ల నుంచే ఇక్క‌డ యువ‌త‌ను స‌మీక‌రించి.. ఎన్నిక‌ల వ్యూహంపై ప్ర‌ణాళిక‌ను కూడా సిద్ధం చేశార‌ని స‌మాచారం.వ‌చ్చే తాను నిల‌బ‌డ‌తాన‌ని గెలిపించాల‌ని ఆయ‌న ఇప్ప‌టికే కొన్ని సామాజిక వ‌ర్గాల నాయ‌కుల‌కు విజ్ఞ‌ప్తులు కూడా చేసిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. తుని గెలుపు టీడీపీకి ప్ర‌తిష్ట అయితే.. య‌న‌మ‌ల‌కు స‌వాలే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

య‌న‌మ‌ల‌కు స‌వాల్‌.. బాబుకు ప్ర‌తిష్ట‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share