అక్క‌డ జెండా ఎగ‌రేసే సత్తా ప‌వ‌న్‌కు ఉందా..!

August 5, 2018 at 3:25 pm
yarra narayana swamy, TDP, Ex Minister, Janasena, Entry, Pawan kalyan, Met

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు.. అనేది ఇటీవ‌ల ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో మ‌రోసారి రుజువైంది. ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. అనూహ్యంగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి య‌ర్రానారాయ‌ణ స్వామి ఇంటికి వెళ్లారు.ఈ ప‌రిణామం స్థానిక నాయ‌కుల్లో తీవ్ర ఉత్కంఠ‌, ఆలోచ‌న‌ను రేకెత్తించింది. వాస్త‌వానికి గ‌త కొన్నాళ్లుగా యాక్టివ్‌గా లేని య‌ర్రా ఫ్యామిలీని తిరిగి మీడియా ముందుకు తెచ్చింది ప‌వ‌నే. స్వ‌యంగా య‌ర్రా ఇంటికి వెళ్లిన ప‌వ‌న్.. ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు. ఆరోగ్య స‌మాచారం తెలుసుకున్నారు.

maxresdefault

ఎన్టీఆర్ హ‌యాం నుంచి రాజ‌కీయాల్లో ఉండ‌డంతో ఆయ‌న అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు రాజ‌కీయాల్లో వ‌చ్చిన మార్పులు వంటివి తెలుసుకున్నాడు ప‌వ‌న్‌. ఇక‌, ఈ సంద‌ర్బంగానే.. య‌ర్రా నారాయ‌ణ‌స్వామి కుమారుడు య‌ర్రా న‌వీన్ జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నాడు. అయితే, ఈ ఫ్యామిలీ అనుకుని కానీ, ముందుగానే నిర్దేశించుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం కానీ.. జ‌న‌సేన‌లోకి చేర‌లేదు. వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ వేసిన అడుగులు వారిని జ‌న‌సేన వైపు న‌డిపించాయి. దీంతో ఇక్క‌డి రాజ‌కీయాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేగింది.

వ‌చ్చే ఎన్నిక‌లకు మ‌రో ప‌దిమాసాల గ‌డువు ఉండ‌డం, తాడేప‌ల్లిగూడెంలో కాపుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో య‌ర్రా వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు టికెట్ ఇవ్వ‌డం ద్వారా కాపుల ఓట్ల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప‌వ‌న్ య‌త్నిస్తున్నాడ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలోనే ఉన్నా.. న‌వీన్ బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు. కానీ, అనూహ్యంగా ప‌వ‌న్ త‌మ ఇంటికి రావ‌డంతో న‌వీన్‌.. జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నాడు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థులుగా రంగంలోకిదిగుతార‌ని భావిస్తున్న ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాల‌రావు, ముళ్ల‌పూడి వంటివారిని ఢీకొట్టి నిల‌వ‌డం అనేది న‌వీన్ చేయ‌గ‌ల‌డా? అనేది పెద్ద సందేహం.

Pawan-JFC-Report

అయితే, ప‌వ‌నే నేరుగా య‌ర్రా ఫ్యామిలీని తిరిగి యాక్టివ్ చేసిన నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి న‌వీన్‌ను గెలిపించుకోవాల్సిన అవ‌సరం ఎంతైనా ప‌వ‌న్‌పైనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ కాపు వర్గం ఎక్కువ‌గా ఉండడం, గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ అభ్య‌ర్తిగా పైడికొండ‌ల విజ‌యం సాదించ‌డం.. వంటివి ప‌వ‌న్‌కు క‌లిసి వ‌స్తున్న అంశాలు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌వీన్‌ను గెలిపించుకోవ‌డం ద్వారా ప‌వ‌న్.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసే అవ‌కాశం ఉంటుంద‌నిఅంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తాడో చూడాలి.

అక్క‌డ జెండా ఎగ‌రేసే సత్తా ప‌వ‌న్‌కు ఉందా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share