అప్పుడు …ఇప్పుడు… జగన్ ను నిలబెట్టింది అదే

April 21, 2018 at 4:01 pm
ys jagan, AP special status, own stand, politics

ఏపీలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఎవ‌రు పైచేయి సాధించాలి? ఎవ‌రు దూసుకు వెళ్లి ఓట్లను గుండు గుత్తుగా ఎత్తేసుకోవాలి ? ఎవ‌రు ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా ల‌బ్ధి పొందాలి ? వ‌ంటి కీల‌క అంశాల్లో ప్ర‌ధానంగా అటు అధికార పార్టీ, ఇటు విప‌క్షం వైసీపీలు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ టీడీపీ వేస్తున్న అడుగుల ముందు. విప‌క్షం వైసీపీ వేస్తున్న అడుగులే అర్దవంతంగా ఉన్నాయ‌ని అంటున్నారు నెటిజ‌న్లు. రాష్ట్రంలో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పు డు.. కేంద్రం వాటిని ప‌రిష్క‌రించే స్థాయిలో లేద‌ని తెలిసిన‌ప్పుడే.. కేంద్రంపై పోరాటానికి దిగాల్సిన అవ‌స‌రాన్ని చంద్ర‌బాబు గుర్తించ‌లేక‌పోవ‌డాన్ని ఏమ‌నుకోవాలంటూ.. ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌న‌ని కేంద్రం దాదాపు రెండేళ్ల కింద‌టే వెల్ల‌డించింది. 

 

ఆ స‌మ‌యంలోనే వైసీపీ తీవ్రస్థాయిలో గ‌ర్జించింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల‌ను అలెర్ట్ చేసింది. త‌న ఎంపీల‌తో పోరాటం చేయిస్తానంటూ జ‌గ‌న్ వెల్ల‌డించారు. అదేక్ర‌మంలో ఆయ‌న విద్యార్థుల‌ను చైత‌న్యం చేసేందుకు యువ‌భేరి వంటి కార్య‌క్ర‌మాల‌ను అనేక నిర్బంధాల మ‌ధ్యే నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో మంత్రి అచ్చ‌న్నాయుడు స‌హా సీఎం చంద్ర‌బాబు.. యువ‌త త‌ల్లిదండ్రుల‌ను తీవ్రంగా హెచ్చ‌రించారు. ఒక నేర‌స్తుడి వ‌ద్ద‌కి మీ పిల్ల‌ల‌ను పంపిస్తారా అంటూ లేనిపోని ర‌గడ సృష్టించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు హోదా ఒక్క‌టే దివ్య ఔష‌ధ‌మ‌ని ఆనాడు వైసీపీ అధినేత గొంతు విప్పితే ఓర్చుకోలేని నేత‌లు ఇప్పుడు ఈ యూట‌ర్న్ తీసుకోవ‌డం ఏంట‌నే వ్యాఖ్య‌లు సైతం సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

 

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను నిజంగా కాంక్షించే వాళ్లే అయితే.. ప‌రిస్థితి వేరేగా ఉండేద‌నే వ్యాఖ్య‌లూ వినిపిస్తున్నాయి. ఇక‌, జ‌గ‌న్ విష‌యంలో రెండేళ్ల‌నాడు ఏం చెప్పాడో.. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడ‌ని ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించ‌డం అనేది ఇప్పుడు చెప్పిన నిర్ణ‌యం ఎంత‌మాత్ర‌మూ కాద‌ని, ఏనాడైతే .. కేంద్రం ఏపీపై దృష్టి పెట్టేందుకు నిర్ల‌క్ష్యం చేసిందో అప్పుడే.. జ‌గ‌న్ ముందుండి పోరాటానికి దిగాడ‌ని, ఎంపీల‌తో రాజీనామాలు చేయించేందుకు రెడీ అయ్యార‌ని, ఇప్పుడు ఏదో ఒక్క‌గా జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న కాద‌ని అంటున్నారు. రాష్ట్రంలో ప్ర‌త్యేక హోదా అంశం నిజంగా స‌జీవంగా ఉందంటే.. అది కేవ‌లం జ‌గ‌న్ ఆయ‌న పార్టీ నేత‌ల వ‌ల్లేన‌ని చెబుతున్నారు. ఎన్నో ప‌రిణామాల‌ను జ‌గ‌న్ చాలా సీరియ‌స్‌గా తీసుకుని ఫైట్ చేస్తున్నందునే హోదాపై ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌దిలింద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో ప్ర‌త్యేకంగా ఏదైనా అభినంద‌న ఉంటే అది కేవ‌లం జ‌గ‌న్‌కు మాత్ర‌మే ద‌క్కుతుంద‌ని నెటిజ‌న్లు అంటుండ‌డం గ‌మ‌నార్హం. 

 

అప్పుడు …ఇప్పుడు… జగన్ ను నిలబెట్టింది అదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share