జ‌గ‌న్ వ్యూహానికి ప‌దును..బాబు కలిస్తేనే సాధ్యం!

July 22, 2018 at 10:32 am
YS Jagan, Chandra babu, AP special Status, Press meet

అవును! నిన్న సాయంత్రం నుంచి అటు టీడీపీ సోష‌ల్ మీడియాకు ప్ర‌భుత్వ ఆర్టీజీ కేంద్రానికి కూడా ఇదే విధ‌మైన సందేశాలు అందుతున్నాయి! ఏపీ విష‌యంలో చంద్ర‌బాబు చేస్తున్న వ్యూహాత్మ‌క త‌ప్పిదాలు.. వేస్తున్న అనాలోచిత అడుగులు.. ఏపీకి ల‌బ్ది చేకూర్చ‌క‌పోగా.. మ‌రింత‌గా బ‌ద్నాం అయ్యేలా చేస్తున్నాయ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నా రు. పార్ల‌మెంటులో కేంద్రాన్ని నిల‌దీయ‌డంలోనే విఫ‌ల‌మైన నాయ‌కులు ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు ఎలాగొడుగు ప‌డ‌తార‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏపీకి ఏమీ ఇవ్వ‌లేదు.. అనే ప‌స‌లేని వాద‌న‌ను మోడీ కొట్టిపారేస్తుంటే.. ఆయ‌న‌కు లెక్కలు.. గ‌ణాంకాలు వివ‌రించాల్సిన నాయ‌కులు.. నీళ్లు న‌ములుతున్నారు. ఎవ‌రికి వారు వంతులు వేసుకుని మాట‌ల రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. త‌మ త‌మ కెరీర్ గ్రాఫ్ పెంచుకునేందుకు ఏపీ స‌మ‌స్య‌ల‌ను పావుగా వాడుకోవాల‌ని అనుకోవ‌డం ఎంపీల‌కు త‌గ‌ని ప‌నిగా చెబుతున్నారు నెటిజ‌న్లు.

ఏ ఎంపీ అయినా.. ప్ర‌జ‌ల ప‌క్షాల పార్ల‌మెంటులో మాట్లాడ‌తాడ‌నే ప్ర‌జ‌లు వారికి ఓట్లు వేస్తారు. అంతేకానీ, తెలుగు మీడియా ముందుకు వ‌చ్చి అడ్డ‌మైన చెత్తా మాట్లాడ‌మ‌ని కాదు. మ‌రి ఇంతోటి దానికి అటు గ‌ల్లాకు, ఇటు రామ్మోహ‌న్‌నాయ‌కుడు ఈ స‌త్కారాలు ఎందుకో అర్ధం కాదు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ త‌ర‌ఫున మిగిలిన టీడీపీ ఎంపీలు కూడా క‌లిసి క‌ట్టుగా పోరాడి ఉంటే ప‌రిస్తితి బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, మైకు ప‌ట్టుకుంటే.. మ‌తి పోయే మ‌న ఎంపీల‌కు ఆ మాత్రం సాహ‌సం కూడా చేయ‌లేక పోయారు. కేశినేని నాని.. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియ‌కుండా పోయింది. విష‌యాన్ని సూటిగా స్ప‌ష్టంగా చెప్పడంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు అండ్ టీం పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఫాలో కావ‌డం బెస్ట్ అంటున్నారు నెటిజ‌న్లు.

జ‌గ‌న్ ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో బాగానే స్పందిస్తున్నారు. ప్ర‌త్యేక హోదాను స‌జీవం చేసింది ఆయ‌నే అనే విష‌యా న్ని ప్ర‌భుత్వానికి బాకా వంటి ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో సైతం రాచుకొచ్చారు. అంటే జ‌గ‌న్ లేకుంటే.. నేడు ప్ర‌త్యేక హోదా చ‌రిత్రలో క‌లిసిపోయేది. ఇక‌, హోదాపై నేడు పార్ల‌మెంటులో సైతం అవిశ్వాసం పెట్టి.. దానిపై కేంద్రాన్ని నిల‌దీసే అవ‌కాశం వ‌చ్చింది కూడా జ‌గ‌న్ మ‌ది నుంచే! ఆయ‌న ఆలోచ‌న నుంచే అవిశ్వాసం పెట్టాల‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈవిష‌యంలో బాబు ఆయ‌న‌తో క‌లిసి రాలేదు. క‌నీసం ఇప్ప‌టికైనా త‌న అహం భావం వ‌దులుకుని.. కేంద్ర‌పై పోరు చేయ‌డంలో జ‌గ‌న్‌తో క‌లిసి రావాల‌నేది నెటిజ‌న్ల మాట‌. ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆయ‌న‌తో క‌లిసి.. చేతులు క‌లిపితే.. క‌నీసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో అయినా మంచి చేసిన వార‌వుతారు.. అనేది నెటిజ‌న్ల మాట‌. మ‌రి బాబు ఆదిశ‌గా అడుగులు వేస్తారా? లేదా చూడాలి!

జ‌గ‌న్ వ్యూహానికి ప‌దును..బాబు కలిస్తేనే సాధ్యం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share