జ‌గ‌న్ బ‌ల‌మా? బాబు బ‌ల‌హీన‌తా?

April 26, 2018 at 11:19 am
YS jagan, chandra babu, strengths, in AP politics,

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్యమైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ‌కీయాల్లో ఏనిముషానికి ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే వ్యాఖ్య‌ల‌ను నిజం చేస్తున్నారు  రాష్ట్ర నేత‌లు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విప‌క్షం వైసీపీ స‌హా చిన్నా చిత‌కా పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేత‌లు అధికార పార్టీ టీడీపీలోకి జంప్ చేశారు. దీనికి వారు అభివృద్ధి అని పేరు పెట్టి ఉండొచ్చుగాక‌!  కానీ.. జ‌రిగింది మాత్రం జంపింగే! అయితే,  ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. గ‌త కొన్నాళ్లుగా వైసీపీ నుంచి వెళ్లేవారు లేక‌పోగా.. వ‌చ్చే వారి సంఖ్య మాత్రం పెరిగింది. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు కూడా జ‌గ‌న్ చెంతకు వ‌చ్చేందుకు క్యూ క‌డుతున్నారు. దీనికి రీజ‌న్ ఏంటి?  నాడు టీడీపీలోకి జంప్ చేసిన నేతల  చెప్పిన విష‌యాన్ని చూస్తే.. బాబు అభివృద్ధిని చూసి వెళ్లామ‌న్నారు. స‌రే! ఆయ‌న అధికారంలో ఉన్నాడు కాబ‌ట్టి.. అభివృద్ధి అజెండాను మోశార‌ని అనుకోవ‌చ్చు. 

 

కానీ, ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతోందిగా! టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల త‌న‌యులు సైతం జ‌గ‌న్ పార్టీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారుగా! మ‌రి దీనిని ఎలా చూస్తారు?   దీనిని ఎలా అర్ధం చేసుకుంటారు?  వైసీపీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు జ‌గ‌న్ బ‌లం పుంజుకుంటోంది!  రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర  నేప‌థ్యంలో పార్టీ కార్య‌క్ర‌మాలు, ఎన్నిక‌ల వ్యూహాలు ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్త‌న్నాయి. అన్ని వ‌ర్గాల వారికీ న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు.. ప‌థ‌కంపై ప్ర‌జల్లో విస్తృతంగా చ‌ర్చ న‌డుస్తోంది. 

 

అదేవిధంగా జ‌గ‌న్‌లోని పార‌ద‌ర్శ‌క‌త విష‌యంలోనూ జ‌నాలు ముగ్ధులు అవుతున్నారు. త‌న‌కు సాధ్యం అనుకున్న విష‌యాన్నే జ‌గ‌న్ హామీ ఇస్తున్నాడు. త‌న‌కు సాధ్యం కాక‌పోతే.. అది ఎంత‌టి విష‌య‌మైనా.. ప‌క్క‌కు పెడుతున్నాడు. ఉదాహ‌ర‌ణ మాదిగ రిజ‌ర్వేష‌న్ విష‌యాన్నే తీసుకుంటే.. విప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌పై మాదిగ సామాజిక వ‌ర్గం నేత‌లు పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. త‌మ‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న చేయాల‌ని. అయితే, ఈ విష‌యంలో భారీ ఎత్తున ఎస్సీ ఓటు బ్యాంకుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలిసినా.. జ‌గ‌న్ వారికి హామీ ఇవ్వ‌లేదు. 

 

ఇది కేంద్రం ప‌రిధిలోని విష‌య‌మ‌ని , తాను ఏమీ చేయ‌లేన‌ని అన్నాడు. అదేవిధంగా ప‌లు విష‌యాల్లోనూ జగన్ పార‌ద‌ర్శ‌కంగా ఉన్నాడు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన విభ‌జ‌న తాలూకు హామీల విష‌యంలోనూ జ‌గ‌న్ ఎక్క‌డిక‌క్క‌డ స్ప‌ష్టంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దీంతో ఆయా విష‌యాల‌ను, జ‌గ‌న్ వైఖ‌రిని చూస్తున్న వివిధ పార్టీల నాయ‌కులు జ‌గ‌న్ పార్టీలో చేరుతున్నార‌ని, ఈ విష‌యంలో వారు సంతృప్తిగా ఉన్నార‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. దీనికితోడు జ‌గ‌న్ మొండి ప‌ట్టుద‌ల ఆయ‌న‌కు ప్ల‌స్‌గా మారింద‌ని, ఏనాడూ ఆయ‌న మ‌డ‌మ తిప్పే రాజ‌కీయాలు చేయ‌లేద‌ని అందుకే ఆయ‌న‌కు ఆద‌ర‌ణ పెరిగింద‌ని అంటున్నారు. మొత్తంగా జ‌గ‌న్ బ‌లం.. బాబు బ‌ల‌హీన రాజ‌కీయాల‌ను స్ప‌ష్టం చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

 

జ‌గ‌న్ బ‌ల‌మా? బాబు బ‌ల‌హీన‌తా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share