జ‌గ‌న్‌కు ఛాన్స్ ఇచ్చిన చంద్ర‌బాబు..

November 4, 2018 at 5:55 pm

ఏపీ సీఎం చంద్ర‌బాబు అడ్డంగా బుక్క‌య్యారా? ఎన్నిక‌ల వేళ‌.. ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాలు ఆయ‌న బూమ‌రాంగ్ కాను న్నాయా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్రంలో రాజ‌కీయాలు మార్పు దిశ‌గా ప యనిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల కంటే ముందుగానే పొత్తులు కుదుర్చు కు న్నారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంట‌రి పోరుకు సిద్ధ‌ప‌డే ధైర్యం లేక‌నో.. లేక ఏవైనా కార‌ణాల‌తోనో ఆయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీతోను, ఇప్పుడు కాంగ్రెస్‌తోను అంట‌కాగుతున్నారు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. కాంగ్రెస్ కు మోక‌రిల్లింది. దీనికి చంద్ర‌బాబు చెబుతున్న రీజ‌న్‌.. దేశ ప్ర‌యోజ‌నం. ప్ర‌జాస్వామ్య ప్ర‌యోజ‌నం.!

అయితే, ఈ రెండు ప్ర‌యోజ‌నాల‌కు చంద్ర‌బాబు లేక‌పోతే.. భంగం ఏర్ప‌డుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. స‌రే ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏపీలో రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్‌కు సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. విశ్వ‌స నీయ రాజ‌కీయాలు చేయడం, వివాద ర‌హితంగా ముందుకు సాగ‌డం ఆయ‌నకు పెట్ట‌ని కోట‌లుగా మారుతున్నాయి. ఎన్ని క‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఏ పార్టీతో క‌లుద్దామా? అనే ధోర‌ణి ఆయ‌న ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. పైగా త‌న ఒంట‌రి పోరును ఆయ‌న ధ్రువీక‌రిస్తున్నారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా.. ఏమైనా.. కూడా జ‌నంతో నే జ‌గ‌న్‌.. అనే విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.

45104688_2344480642232180_8739492435647791104_n

2014 ఎన్నిక‌ల్లో కానీ, ఇప్పుడు రాబోయే ఎన్నిక‌ల్లో కానీ… వైసీపీ ఒంట‌రిగానే బ‌రిలో నిల‌వ‌నుంద‌నే విషయం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త‌న‌కు ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే చంద్ర‌బాబు మాత్రం ఎవ‌రో ఒక‌రి తోడు లేకుండా మాత్రం ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేక‌పోతున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ప‌ర‌మావ‌ధిగా చంద్ర‌బాబు ఏ పార్టీతోనైనా జ‌ట్టుక‌ట్టేందుకు రెడీ అవు తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్‌తో క‌లిసి న‌డిచేందుకు ఢిల్లీ వెళ్లి మ‌రీ కాంగ్రెస్‌ను క‌లుపు కొన్నారు. కేంద్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న స‌త్తా ఏంటో కూడా చూపించ‌లేక‌పోయినా.. క‌నీసం ఒక్క రాష్ట్రంలోనూ సొంత‌గా పార్టీ అధికారంలోకి తీసుకురాలేక పోయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ వ‌ద్ద‌కు చంద్ర‌బాబు వెళ్లారు.

ఆయ‌న చెలిమిని ఆశించారు. ఇప్పుడు ఈ ప‌రిణామాల‌నే వైసీపీ త‌న‌కు అస్త్రంగా మ‌లుచుకోవాల‌ని సూచిస్తున్నారు మేధావులు. ఒక‌ప్పుడు ఏ ఆత్మ‌గౌర‌వ నినాదంతో ముందుకు వెళ్లారో.. ఆ పార్టీ నేడు అదే ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచిన‌, ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న‌తో తెలుగు ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ల‌పై దెబ్బ‌కొట్టిన కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు నేడు చెలిమి చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ఎండ‌గ‌ట్టేందుకు వైసీపీ శ్రేణులు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఆస‌న్న‌మైంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌గ‌న్‌కు ఛాన్స్ ఇచ్చిన చంద్ర‌బాబు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share