తూర్పులో జ‌గ‌న్ ఎంట్రీతోనే టీడీపీకి పెద్ద దెబ్బ‌

June 13, 2018 at 2:38 pm
YS JAGAN, East Godavari, Praja samkalpa Yatra, TDP Ex chairmen, guthula buliraju

పశ్చిమ గోదావ‌రి నుంచి తూర్పు గోదావ‌రిలోకి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌వేశించింది. అశేష జ‌న స‌మూహం ఆయ‌న వెంట తోడు రాగా.. జ‌న గోదారిని త‌ల‌పించేలా.. అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా పాద‌యాత్ర రాజ‌మండ్రికి చేరుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల్లో వైసీపీకి చెప్పుకోద‌గ్గ స్థాయిలో సీట్లు రాలేదు. కానీ 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ప‌రిస్థితిలో మార్పు త‌ప్పనిస‌రిగా ఉంటుంద‌ని వైఎస్సార్‌సీపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ప‌శ్చిమ‌లో జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టిన జ‌నం.. తూర్పులో అంత‌కు రెట్టింపు స్థాయిలో ఆద‌రిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ నేత‌ల్లో కొంత అల‌జ‌డి మొద‌లైంది.

అయితే తూర్పులో జ‌గ‌న్ ఎంట్రీతోనే టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింద‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా కోన‌సీమ‌లో టీడీపీకి అండ‌గా నిలుస్తున్న సీనియ‌ర్ నాయ‌కుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీంతో పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింద‌నే చ‌ర్చ మొద‌లైంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ అధినేత జ‌గ‌న్ రాక‌తో జిల్లా రాజకీయాల్లో ఆస‌క్తికర ప‌రిణామాలు జ‌రుగుతాయ‌ని అంతా భావిస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు నేత‌లు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతార‌నే ఊహానాలు జోరందుకున్నాయి. ఇదే స‌మ‌యంలో టీడీపీ నుంచి కూడా వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని వైసీపీ నేతలు ఆశ‌తో ఉన్నారు.

ఇదే త‌రుణంలో టీడీపీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. జెడ్పీ మాజీచైర్మన్‌ గుత్తుల బులిరాజు దంపతులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గొల్లపాలెంలో వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. టీడీపీలో జిల్లాస్థాయి గుర్తింపు పొందిన తనకు ప్రస్తుతం పార్టీలో సరైనగుర్తింపు లభించకపోవడంతో పార్టీని వీడుతున్నట్టు జెడ్పీ మాజీ చైర్మన్‌ గుత్తుల బులిరాజు, మాజీ జెడ్పీటీసీ గుత్తుల సత్యాదేవి తెలిపారు.

జెడ్పీ వైస్‌చైర్మన్‌గా, చైర్మన్‌గానే కాకుండా కార్యకర్తగా టీడీపీకి చేసిన సేవల్ని పార్టీ గుర్తించకపోవడం దారుణమని బులిరాజు వాపోయారు. గత ఎన్నికల్లో కాజులూరు మండలం నుంచి జెడ్పీటీసీకి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసి టీడీపీకి మేలు చేసే ఉద్దేశంతో ఉపసంహరించుకున్నప్పటికీ పార్టీ ముఖ్యులు తనని గుర్తించలేదని బులిరాజు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్లే ప్రస్తుతం పార్టీని వీడుతున్నామని తెలిపారు.

తూర్పులో జ‌గ‌న్ ఎంట్రీతోనే టీడీపీకి పెద్ద దెబ్బ‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share